Hero Tom Holland Injured : స్పైడ‌ర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ కు గాయాలు

షూటింగ్ జ‌రుగుతుండ‌గా ప్ర‌మాదం

Hello Telugu - Hero Tom Holland Injured

Hello Telugu - Hero Tom Holland Injured

Tom Holland : అమెరికా : ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు టామ్ హాలండ్ (Tom Holland) కు గాయాలు అయ్యాయి. స్పైడ‌ర్ మ్యాన్ మూవీ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాజాగా స్పైడ‌ర్ మ్యాన్ పేరు సినిమా తీస్తున్నారు. షూటింగ్ సంద‌ర్భంగా త‌ను గాయ‌ప‌డ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో చిత్రీక‌ర‌ణ ఆగి పోయింది. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం 2026లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ మేర‌కు యుద్ద ప్రాతిప‌దిక‌న షూటింగ్ పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు డేనియ‌ల్ క్రెట్ట‌న్. ఈ మూవీలో టైటిల్ పాత్ర పోషించాడు ఈ 29 ఏళ్ల న‌టుడు. స్టంట్‌లల గాయ‌ప‌డ్డాడ‌ని చిత్రీక‌ర‌ణ చేస్తున్న స‌మ‌యంలో జ‌రిగిందంటూ పేర్కొన్నారు. త‌ను కింద ప‌డ‌డంతో హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు చెప్పారు మూవీ మేక‌ర్స్.

Tom Holland Injured

ఇప్ప‌టికే విడుద‌ల తేదీ కూడా ముందుగానే ప్ర‌క‌టంచారు చిత్ర నిర్మాత‌లు. జూలై 31న ఖ‌రారు చేశారు. ప్ర‌పంచ‌మంత‌టా స్పైడ‌ర్ మ్యాన్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంది. ప్ర‌త్యేకించి చిన్నారులు, యువ‌త‌లో.
ఈ చిత్రంలో జెండయా, జాకబ్ బటలోన్, సాడీ సింక్ , లిజా కోలన్-జయాస్ తదితరులు నటించారు. ఇక టామ్ హాలండ్ గత నెల ప్రారంభంలో ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభించిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపాడు. నేను సిద్దం మరి మీరు సిద్దంగా ఉన్నారా అనే క్యాప్ష‌న్ తో ఓ ఫోటో కూడా పంచుకున్నాడు న‌టుడు. ప్ర‌స్తుతానికి ప్ర‌మాదం నుంచి హీరో బ‌య‌ట ప‌డ్డాడ‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు ద‌ర్శ‌కుడు. అయితే అభిమానులు ఆయ‌న బాగుండాల‌ని కోరుతున్నారు. ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

Also Read : Zubeen Garg Death : జుబీన్ గార్గ్ కు క‌న్నీటి నివాళి

Exit mobile version