Zubeen Garg Death : జుబీన్ గార్గ్ కు క‌న్నీటి నివాళి

జ‌న‌సంద్ర‌మైన గౌహ‌తి న‌గ‌రం

Hello Telugu - Zubeen Garg Death

Hello Telugu - Zubeen Garg Death

Zubeen Garg : అస్సాం : అస్సాం రాజ‌ధాని గౌహ‌తి జ‌న‌సంద్రంగా మారింది . ప్ర‌ముఖ ప్ర‌జా గాయ‌కుడు జుబీన్ గార్గ్ సింగ‌పూర్ లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఆయ‌న మృత దేహాన్ని న‌గ‌రానికి తీసుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు దారి పొడవునా అభిమానులు క‌న్నీటి నివాళులు అర్పించారు. రాష్ట్ర బీజేపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం హిమంత బిస్వ శ‌ర్మ అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిపించాల‌ని ఆదేశించారు. ఆయ‌నే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. అస్సాం భూమి పుత్రుడంటూ కొనియాడారు. ర‌హ‌దారుల‌న్నీ నిండి పోయాయి. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ప్ర‌జా గాయ‌కుడా అల్విదా అంటూ నినాదాలు చేశారు. మా ప్రియ‌మైన పాట‌గాడా నీకు మ‌ర‌ణం లేదు. నీ పాట ఎల్ల‌ప్ప‌టికీ చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు. చివ‌రి చూపు చూసేందుకు పోటెత్తారు. త‌ను పాడిన పాట‌ల‌తో నిండి పోయింది ఆ ప్రాంమంతా.

Zubeen Garg Funeral

దాదాపు 25 కిలోమీట‌ర్ల‌కు పైగా సాగింది జుబీన్ గార్గ్ (Zubeen Garg) అంతిమ యాత్ర‌. త‌న‌ను ద‌ర్శించుకుని నివాళులు అర్పించేందుకు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉన్నారు . అస్సాం సాంస్కృతిక చిహ్నంగా నిలిచి పోయాడు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు వ‌స్తాడు. ఆ త‌ర్వాత అంత‌టి పేరు తీసుకు వ‌చ్చేలా చేసిన గాయ‌కుడు జుబీన్ గార్గ్. చాలామంది పూలు గమోసాలను సమర్పించగా, కొందరు తమ వీడ్కోలు క్షణాలను మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. గాయకుడు పాపోన్ సహా ప్రముఖ వ్యక్తులు శోక సముద్రంలో చేరారు, చాలా మంది తమ ప్రియమైన ‘జుబీన్ దా’ ముందు వంగి నమస్కరిస్తూ విలపించారు. అభిమానులు కూడా వేదిక వెలుపల అతని ప్రసిద్ధ పాటలను పాడారు, నివాళులు అర్పించిన తర్వాత కూడా బయలు దేరడానికి నిరాకరించారు. జుబీన్ గార్గ్ భార్య గరిమా క‌న్నీళ్ల‌తో న‌మ‌స్క‌రించింది భూమి పుత్రుడికి.

Also Read : Hero Rajinikanth Fan : తలైవా విగ్రహం పెట్టి 9 రోజులు చేస్తున్న వీరాభిమాని

Exit mobile version