హైదరాబాద్ : అందమైన జంటగా పేరు పొందారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లో ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కు గురయ్యారు. ప్రధానంగా కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షోలో ఈ ఇద్దరూ పలు ప్రశ్నలకు కూల్ గా సమాధానాలు ఇచ్చారు. కానీ వాటిని అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవడం, అదే పనిగా సామాజిక మాధ్యమాలలో వీరి గురించి కామెంట్స్ చేయడం జరుగుతోంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు తమ అకౌంట్లను ఫాలో కావడం లేదంటూ , త్వరలోనే ఈ ఇద్దరూ విడి పోతారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు స్పందించారు తీవ్రంగా.
దీనిపై స్పందించిన రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు. తాజాగా,విజయ్ దేవరకొండ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికతో కలిసి ఉన్న కొన్ని ఆత్మీయమైన ఫోటోలను పంచుకున్నారు. ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తన పోస్ట్‌లో ఆయన ఇలా పేర్కొన్నారు: నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా భాగస్వామి. నా జీవితంలో నేను పొందిన అత్యంత అందమైన బహుమతుల్లో ఒకటి. మా గురించి ఆందోళన చెందుతున్న వారికి చెబుతున్నాను. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. నేను నిజంగా అదృష్టవంతుడిని. ప్రపంచం మొత్తం మాకు వ్యతిరేకమైనా సరే, మేము కలిసి ఉంటాం. ప్రేమను, సరళమైన సంతోషకరమైన జీవనాన్ని ఆదరించే వారందరికీ నా ప్రేమ. ఇక మా పట్ల ఏమాత్రం గౌరవం లేదా మర్యాద లేని వారికి… మీరు ఎక్కడికి వెళ్లాలో మీకే తెలుసు అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు రౌడీ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ.
