Speaker Ayyannapatrudu Important Comments : మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం అభివృద్దికి సోపానం

స్ప‌ష్టం చేసిన స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు

Hello Telugu - Speaker Ayyannapatrudu Important Comments

Hello Telugu - Speaker Ayyannapatrudu Important Comments

Speaker Ayyannapatrudu : తిరుప‌తి : మ‌హిళ‌ల భాగ‌స్వామ్యంతోనే అభివృద్ది సాధ్యం అవుతుందని అన్నారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు (Speaker Ayyannapatrudu). తిరుప‌తిలో జ‌రిగిన మ‌హిళా ప్ర‌జాప్రతినిధుల సాధికార‌త స‌ద‌స్సు లో పాల్గొని ప్ర‌సంగించారు. నిర్వ‌హించిన జాతీయ కాన్ఫ‌రెన్స్ స‌క్సెస్ అయ్యింద‌ని, త‌న‌కు సంతోషం క‌లిగించింద‌ని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటూ తీర్మానం చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. మూడు సంవత్సరాల తరువాత ఇలాంటి సదస్సును అమరావతిలో నిర్వ‌హిస్తామ‌ని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

Speaker Ayyannapatrudu Comments

మహిళా సాధికారత జాతీయ సదస్సు రెండవ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, గౌరవ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గౌరవ రాజ్యసభ ఉప సభాపతి హరివంశ్ , ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉప సభాపతి మయాన జకియా ఖానం , పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా–శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, ఉప సభాపతి రఘు రామకృష్ణరాజు , దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీక‌ర్ మాట్లాడారు. రెండు రోజులపాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ , శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యా రంగంలోను, సమాజ సేవలోను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు.

Also Read : Mauritius PM Interesting Visit to Tirumala : తిరుప‌తికి చేరుకున్న మారిష‌స్ ప్ర‌ధాని

Exit mobile version