Mauritius PM Interesting Visit to Tirumala : తిరుప‌తికి చేరుకున్న మారిష‌స్ ప్ర‌ధాని

గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పిన మంత్రి ఆనం

Hello Telugu - Mauritius PM Interesting Visit to Tirumala

Hello Telugu - Mauritius PM Interesting Visit to Tirumala

Mauritius PM : తిరుప‌తి : ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు ఉన్నారు తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి. ఆయ‌న‌ను నిత్యం ల‌క్ష‌లాది మంది కొలుస్తారు. తాము కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పూజిస్తున్నారు. నిత్యం ఆయ‌న ద‌ర్శ‌నం చేసుకుంటే చాలు అని అనుకుంటారు. వీరిలో అన్ని వ‌ర్గాల వారున్నారు. రాజ‌కీయ‌, క్రీడా, సినీ సాంస్కృతిక‌, వ్యాపార‌, వాణిజ్య‌, త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు నిత్యం తిరుమ‌ల‌కు విచ్చేస్తుంటారు. స్వామిని ద‌ర్శించుకుంటారు. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌ముఖుల తాకిడి పెరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా సోమ‌వారం మారిషెస్ దేశ ప్ర‌ధాన‌మంత్రి (Mauritius PM) నవీన్ చంద్ర రామ్గులాం తిరుప‌తికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.

Mauritius PM Visited Tirumala

ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న ప్ర‌ధాని, కుటుంబ స‌భ్యుల‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం స్వాగతం ప‌లికారు. తిరుమల శ్రీవారిని దర్శించేందుకు విచ్చేశారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ లాల్, అనంతపురం డిఐజి షిమోసి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, పలువురు నేతలు, ఉన్నతాధికారులు స్వాగ‌తం చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్ర‌మానికి చేరుకుంటారు. అనంతరం తిరుమల చేరుకోనున్నారు మారిషస్ ప్రధాని . పీఎంకు స్వాగతం పలికిన వారిలో శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ , ఎడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి , రేణిగుంట తహసిల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు.

Also Read : CM Chandrababu Clear Instructions : మాననీయ కోణంలో క‌లెక్ట‌ర్లు ప‌ని చేయాలి : సీఎం

Exit mobile version