Popular Simhachalam Chandanotsavam : ఘ‌నంగా అప్ప‌న్న స్వామి చంద‌నోత్స‌వం

సింహాచలానికి పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు

Hello Telugu - Popular Simhachalam Chandanotsavam

Hello Telugu - Popular Simhachalam Chandanotsavam

Chandanotsavam : విశాఖ‌ప‌ట్నం జిల్లా – ఆషాడ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరి విడత చందన సమర్పణ సంప్రదాయ బద్ధంగా జరిగింది. అర్చకులు వేకువ జామున స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల (సుమారు 125) కిలోల శ్రీగంధాన్ని సమర్పించారు. గిరి ప్రదక్షణ పూర్తి చేసుకొని వచ్చిన అశేష భక్తజనం స్వామిని దర్శించుకున్నారు.

Simhachalam Chandanotsavam

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌నలు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ఏపీ రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చేయ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం దేవస్థానం అధికారులు ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పించారు.

వేలాది మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. బుధవారం రాత్రి గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు ఇంకా సింహాచలం క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి భక్తజనంతో కిక్కిరిసి పోయింది. సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీ‌ను బాబు ద‌గ్గ‌రుండి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

Also Read : Ex MP Undavalli Shocking Comments : జ‌గ‌న్ భ‌విష్య‌త్తులో ముఖ్య‌మంత్రి కాలేడు

Exit mobile version