Ex MP Undavalli Shocking Comments : జ‌గ‌న్ భ‌విష్య‌త్తులో ముఖ్య‌మంత్రి కాలేడు

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్

Hello Telugu - Ex MP Undavalli Shocking Comments

Hello Telugu - Ex MP Undavalli Shocking Comments

Ex MP Undavalli : విజ‌య‌వాడ – మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ, జ‌న‌సేన క‌లిసి వ‌చ్చే 2029లో పోటీ చేస్తే 50 శాతానికి పైగా ఓట్లు వ‌స్తాయ‌న్నారు. అందువ‌ల్ల వైఎస్సార్సీపీ ప‌వ‌ర్ లోకి రావ‌డం క‌ష్ట‌మేన‌ని, ఇక మ‌రోసారి సీఎం కావాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్ ఆశ‌లు అడియాశ‌లు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని జోష్యం చెప్పారు. తాజాగా మాజీ ఎంపీ (Ex MP Undavalli) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. గురువారం ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

Ex MP Undavalli Arun Kumar Slams

ఒక‌వేళ 50 శాతం పైన ఓట్లు వస్తే కనీసం 145 నుంచి 155 సీట్లు తప్పకుండా ఈ కూటమికి
వస్తాయని చెప్పారు. 2029 లోపల వైఎస్ జగన్ మీద ఇప్పుడున్న ఈడి , సిబిఐ 22 కేసు ల్లో శిక్ష పడి ఛాన్స్ ఉంద‌న్నారు. ఒక‌వేళ అన‌ర్హ‌త వేటు ప‌డి, అరెస్ట్ అయితే , జైలుకు వెలితే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని తెలిపారు. తదుపరి విచారణ కోసం హైకోర్టు , సుప్రీంకోర్టులో దాదాపు పది సంవత్సరాలు దూరంగా ఉండాల్సి ఉంటుంద‌న్నారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్.

డిస్ క్వాలిఫై అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్నారు. 10 ఏళ్ల పాటు దూరంగా ఉండాల్సి ఉండ‌డంతో, ఇక జ‌గ‌న్ ఏపీకి సీఎం అయ్యే ఛాన్స్ లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు మాజీ ఎంపీ.

నేను 2014-19 ఏది చెప్పినా వైసీపీ వాళ్లు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లే వార‌న్నారు. కానీ టీడీపీ వాళ్ళు నేను చెప్పినవి ఎక్కడా ప్రచారం చేయడం లేద‌న్నారు. అందువలనే జగన్ ఇక జన్మలో సీఎం కాడు అన్న విషయం ఇంకా ప్రజల్లోకి వెళ్ళ లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్.

Also read : Minister Kandula Durgesh Proven : విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు

Exit mobile version