Silver Price Growth : వెండి పరుగులు – 2 లక్షల దిశగా దూసుకెళ్తున్న ధరలు!

ఒకే సంవత్సరంలో వెండి ధరలు దాదాపు రెట్టింపు స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.

Hello Telugu - Silver Price Growth

Hello Telugu - Silver Price Growth

Silver : దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 2025 సంవత్సరం వెండి మార్కెట్‌లో చరిత్ర సృష్టించినట్లయింది. ఒకే సంవత్సరంలో వెండి ధరలు దాదాపు రెట్టింపు స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.

తాజా సమాచారం ప్రకారం, ఢిల్లీలో కిలో వెండి (Silver) ధర ₹1,89,100 వద్దకు చేరుకుంది — అంటే రూ.2 లక్షల మార్క్‌కు సన్నిహితంగా ఉంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై వంటి రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఇప్పటికే ₹2 లక్షలు దాటింది. 2025లో వెండి ధరలు ఇప్పటి వరకు దాదాపు 100% పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

Silver – అంత వేగంగా పెరుగుదల ఎందుకు?

వెండి (Silver) ధరల్లో ఈ గణనీయ పెరుగుదల పెట్టుబడిదారులను, వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. గత సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున వెండి ధర ₹89,700 కాగా, ప్రస్తుతం అది ₹1,89,100కు చేరింది. అంటే సుమారు ₹1 లక్ష పెరిగింది. కేవలం గత నెల చివరి నాటికి వెండి ధర ₹1,50,500గా ఉండగా, ఇప్పుడు దాదాపు ₹30,000 పైగా పెరిగింది.

నిపుణుల ప్రకారం, ఇది సాధారణ పెరుగుదల కాదు. అనేక దశాబ్దాల తర్వాత వెండి మార్కెట్‌లో ఇంత వేగంగా ధరల పెరుగుదల చోటుచేసుకోవడం అరుదైన విషయం.

దీపావళి నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం

దీపావళి ఈసారి అక్టోబర్ 20న జరగనుంది. ఆ రోజు ఢిల్లీ బులియన్ మార్కెట్ తెరిచి ఉండనుంది. పండుగ సీజన్ డిమాండ్, పారిశ్రామిక వినియోగం పెరగడంతో, రాబోయే ఆరు రోజుల్లో వెండి ధరలు ₹2 లక్షలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి ధరలు 12-13% వరకు పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి పెరుగుదలకు ప్రధాన కారణాలు:

ఈ అంశాలన్నీ కలసి వెండి ధరలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే వారాల్లో వెండి ధరలు మరింత పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

Also Read : Today Gold Price : రోజురోజుకి దూసుకుపోతున్న పసిడి ధరలు

Exit mobile version