Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పసిడి మార్కెట్‌లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ధరలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, సాధారణ వర్గాల ప్రజలు బంగారం (Gold) కొనుగోలు చేయడం కష్టసాధ్యమైపోతోంది.
Gold Price Updates
బుధవారం కూడా బంగారం ధరలు మరోసారి పెరిగి కొత్త గరిష్టాన్ని తాకాయి. తాజా సమాచారం ప్రకారం, 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹12,836, 22 క్యారెట్ల బంగారం ధర ₹11,766, అలాగే 18 క్యారెట్ల బంగారం ధర ₹9,627 గా ఉంది.
10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి – 24 క్యారెట్లు ₹1,28,360, 22 క్యారెట్లు ₹1,17,660, 18 క్యారెట్లు ₹96,270.
నిపుణుల ప్రకారం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి సారించడంతో బంగారంపై డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పలు ఆర్థిక అంశాలు, జియోపాలిటికల్ పరిస్థితులు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక వెండి ధరలు కూడా బంగారం సరసన రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం, వెండి ధరలు ఇంతకు మునుపెన్నడూ లేనంతగా పెరగడం వినియోగదారుల ఆందోళనకు కారణమైంది.
బంగారం ధరలు ప్రతి నగరంలో కొంత వ్యత్యాసంగా ఉంటాయి. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా మార్పులు చోటుచేసుకుంటాయి.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24కే / 22కే / 18కే):
- చెన్నై: ₹1,29,010 / ₹1,18,260 / ₹97,710
- ముంబై: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- ఢిల్లీ: ₹1,28,510 / ₹1,17,810 / ₹96,470
- కోల్కతా: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- బెంగళూరు: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- హైదరాబాద్: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- కేరళ: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- పూణె: ₹1,28,360 / ₹1,17,660 / ₹96,270
- వడోదరా: ₹1,28,410 / ₹1,17,710 / ₹96,320
- అహ్మదాబాద్: ₹1,28,410 / ₹1,17,710 / ₹96,320
బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read : Today Gold Price : ఎన్నడూ లేని స్థాయికి చేరిన పసిడి ధరలు
