Shreyas Iyer Love Story : ఎడిన్ రోజ్ లవ్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ బౌల్డ్

సినీ న‌టి ..బిగ్ బాస్ ఫేమ్ గా గుర్తింపు

Hello Telugu - Shreyas Iyer Love Story

Hello Telugu - Shreyas Iyer Love Story

Shreyas Iyer : ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో త‌న బ్యాటింగ్ తో రైళ్లు ప‌రుగులు పెట్టించే స్టార్ క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఉన్న‌ట్టుండి ఓ ముద్దుగుమ్మ ల‌వ్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంత‌కీ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..ఆమె ఎవ‌రో కాదు మోస్ట్ పాపుల‌ర్ బిగ్ బాస్ ఫేమ్ గా , న‌టిగా గుర్తింపు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా అయ్య‌ర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. త‌ను ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు స్కిప్పర్ గా ఉన్నాడు. గ‌త ఏడాది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్నాడు. ఆ టీమ్ ను విజ‌య‌ప‌థంలో న‌డిపించాడు. ఏకంగా త‌న జ‌ట్టుకు ఐపీఎల్ క‌ప్ ను అందించాడు.

Shreyas Iyer Love Story

కానీ ఉన్న‌ట్టుండి దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన వేలం పాట‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ మేనేజ్మెంట్ ఓన‌ర్ ప్రీతి జింతా భారీ ధ‌ర‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. సంచ‌ల‌నం సృష్టించింది వారు వేసిన బిడ్ తో. తాను ఎంత గొప్ప నాయ‌కుడో ప్రూవ్ చేసుకున్నాడు తాజాగా జ‌రిగిన ఐపీఎల్ మెగా టోర్నీలో. పంజాబ్ జ‌ట్టును కొన్నేళ్ల త‌ర్వాత సెమీస్ దాకా తీసుకు వెళ్లాడు. ఇందులో త‌ను కీల‌క పాత్ర పోషించాడు. నాయ‌క‌త్వ ప‌రంగా పేరు పొందాడు. వంద మార్కులు సాధించాడు.

స్కిప్ప‌ర్ గా త‌ను స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులోకి వ‌చ్చేందుకు రేసులో ఉన్నాడు కూడా. త‌న స్థానం సుస్థిరం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో న‌టి ఎడిన్ రోజ్ ల‌వ్ కు ప‌డి పోయాడ‌ని, ఈ ఇద్ద‌రూ క‌లిసి డేటింగ్ లో ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read : CM Chandrababu Strong Reaction : బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వ‌ల్ల ఎవ‌రికీ న‌ష్టం జ‌ర‌గ‌దు – సీఎం

Exit mobile version