Youtube Shocking : ఇకపై యూట్యూబ్ నుంచి ఆ వీడియోలకు నో మనీ

కాపీ చేసిన వీడియోలపై కత్తెర వేస్తూ యూట్యూబ్ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది...

Hello Telugu - Youtube Sshocking

Hello Telugu - Youtube Sshocking

Youtube : యూట్యూబ్‌ను ఆదాయ వనరుగా మార్చుకుంటున్న అనేక మంది కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. యూట్యూబ్‌ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) మార్గదర్శకాల్లో సరికొత్త మార్పులు త్వరలో అమల్లోకి రానున్నాయి. అసలు కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ, కాపీ చేసిన వీడియోలపై కత్తెర వేస్తూ యూట్యూబ్ (Youtube) కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

Youtube – జూలై 15 నుంచి కొత్త నిబంధనలు

జూలై 15, 2025 నుంచి యూట్యూబ్ (Youtube) తన కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు యూట్యూబ్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త పాలసీ ప్రకారం, ఇతరుల వీడియోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, ఏఐ ఆధారిత స్లయిడ్ షోలను పోస్ట్ చేయడం, లేదా చిన్న మార్పులతో పాత వీడియోలను తిరిగి వాడటం ద్వారా వచ్చే వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఉండదు.

ఈ విధంగా మారుతున్న పాలసీ

ఎలాంటి కంటెంట్‌కు ప్రాధాన్యత?

యూట్యూబ్ ప్రకారం, విద్యాపరమైన వీడియోలు, అసలైన వినోదాత్మక కంటెంట్, మానవ కృషితో రూపొందించిన వీడియోలకే మానిటైజేషన్ మంజూరు చేస్తారు. యాడ్ సేవల పరంగా కూడా మార్పులు చేయనుంది. “Bare Skin (Image Only)” అనే ప్రకటన కేటగిరీని యూట్యూబ్ తొలగిస్తోంది. దీన్ని ఉపయోగిస్తున్న యూట్యూబ్ చానెల్స్ ఆగస్ట్ 15లోపు తమ యాడ్ సెట్టింగులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మార్పుల ప్రధాన ఉద్దేశ్యం

ఈ మార్పులు ఏఐ కంటెంట్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, మానవ క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వడం, కంటెంట్ కాపీరైట్ ఉల్లంఘనను నివారించడం అనే లక్ష్యాలతో తీసుకొచ్చినవి. యూట్యూబ్‌ను ఉపయోగించే వ్యక్తులు అసలైన విలువను అందించాలని, ప్లాట్‌ఫామ్ నాణ్యతను పెంచడమే లక్ష్యమని యూట్యూబ్ స్పష్టం చేసింది.

సూచన: ఈ మార్గదర్శకాలు YPPలో భాగంగా ఉన్న సృష్టికర్తలందరికీ వర్తిస్తాయి. చానెల్‌ యాజమానులు తమ కంటెంట్‌ను సమీక్షించుకుని, మారుతున్న నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలి.

Also Read : Milk and Curd Interesting Facts : మీరు ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారా అయితే ఇది చూడండి

Exit mobile version