ACB Shocking KTR : కేటీఆర్ కు షాక్ ఏసీబీకి లైన్ క్లియ‌ర్

అనుమ‌తి ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ

Hello Telugu - ACB Shocking KTR

Hello Telugu - ACB Shocking KTR

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఫార్ములా వ‌న్ రేస్ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టేందుకు అవినీతి నిరోధ‌క శాఖ‌కు అనుమ‌తి ఇచ్చారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ శ‌ర్మ‌. గురువారం ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం వెల్ల‌డించింది. దీంతో త్వ‌ర‌లో రాష్ట్ర స‌ర్కార్ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు స‌మాయత్తం అవుతోంది. ఈ త‌రుణంలో ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా ఫార్ములా వ‌న్ కార్ రేసుకు సంబంధించి ప‌లుమార్లు ఏసీబీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇందులో రూ. 54.88 కోట్లు దుర్వినియోగం అయ్యాయ‌ని, దీనికి ప్ర‌ధాన కార‌కుడు కేటీఆర్ అంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ACB Shocking KTR

ఈ త‌రుణంలో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ కు విన్న‌వించింది. ఎవ‌రినైనా ప్ర‌జా ప్ర‌తినిధి ని అదుపులోకి తీసుకోవాలంటే ముందుగా స్పీక‌ర్ తో పాటు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో త‌న‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ద‌మైన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తూ వ‌స్తున్నారు కేటీఆర్. దీంతో సీఎంకు ఆయ‌న కంట్లో న‌లుసుగా మారారు. కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌క పోయినా కేటీఆర్ ను ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆరోపించారు. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Kavitha Strong Demand : బ‌స్తీవాసుల‌కు ప‌ట్టాలు ఇవ్వాలి : క‌విత‌

Exit mobile version