Kavitha : రంగారెడ్డి జిల్లా : బస్తీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఇప్పటి వరకు వారికి పట్టాలు ఇవ్వక పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం జలాల్ బాబా నగర్, భూపాల్ నగర్ బస్తీ వాసులతో సమావేశం అయ్యారు. ఇంటి స్థలాలకు పట్టాలు, సహా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత (Kavitha) మీడియాతో మాట్లాడారు. జనంబాటలో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు ఉన్న చోటికి వెళ్తున్నామని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి సర్కార్ పై ఒత్తిడి తెస్తామన్నారు.
Kavitha Demands Telangana Govt for Slum Dwellers
ఇవ్వాళ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్ పరిధిలోని భూపాల్ నగర్ లో పర్యటించడం జరిగిందన్నారు. ఇక్కడ 45 ఏళ్లుగా 25 ఎకరాల్లో 2 వేల కుటుంబాల వాళ్లు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని చెప్పారు కవిత. అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాక పట్టాలిస్తామని చెప్పాయి. కానీ ఆ పని మాత్రం జరగలేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్లు కూడా సమస్య పరిష్కారం కావాలని అంటున్నారు. కానీ ఆచరణలో విఫలం అయ్యాయని ఆరోపించారు . ఇప్పుడున్న ల్యాండ్ కు డబుల్ ల్యాండ్ ను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పుడు మాత్రమే వీరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు.
Also Read : Hydraa Saves Huge Land in Karman Ghat : కర్మన్ ఘాట్ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
