Sheikh Salahuddin : హైదరాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యు) తన ఇంపాక్ట్ ఎవాల్యూషన్ రిపోర్ట్ 2024 ను విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణలో గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, యూనియన్ చేపట్టిన చర్యలు, వాటి ప్రభావం, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇందులో పూర్తిగా తెలియ చేశారు. ఇందులో ప్రధానంగా రైడ్-హైలింగ్, డెలివరీ, సర్వీస్ ప్లాట్‌ఫాంలలో పనిచేస్తున్న కార్మికుల అనుభవాలు పొందు పరిచారు. ప్రధానంగా గిట్, ప్లాట్ ఫాం వర్కర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ రిపోర్టులో. సామాజిక భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. విధాన చర్చల్లో కార్మికుల గొంతును బల పర్చాలని ప్రతిపాదించారు. సంఘటిత శక్తిని పెంచడం , ప్రతినిధి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పేర్కొంది.
Sheikh Salahuddin Release GIG and Platform
పెద్ద ఎత్తున వర్కర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్స్ చేపట్టాలని, ప్రభుత్వంతో విధాన సంప్రదింపులు జరపాలని, ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. గౌరవ ప్రదమైన జీవనం, భద్రత, న్యాయమైన వేతనాల కోసం పోరాటం ఇంకా కొనసాగుతున్నదని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక భవిష్యత్తులో మరింత బలమైన సంఘటిత చర్యలు తీసుకోవాలని, విస్తృత కవరేజ్, సమగ్ర కార్మిక విధానాలు అవసరమని సూచిస్తుంది. ఇందులో సాధించిన విజయాలే కాకుండా సమస్యల పరిష్కారం మరింత దూకుడుగా వ్యవహరించాలని స్పష్టం చేసింది . ఇందుకు సంబంధించి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ ఫౌండర్, అధ్యక్షుడు సలావుద్దీన్.
Also Read : PVR Prashanth Growth : టీమిండియా మేనేజర్ గా పీవీఆర్ ప్రశాంత్
