PVR Prashanth : అమరావతి – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు దుబాయ్ లో జరిగే ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు పీఆర్ ప్రశాంత్ (PVR Prashanth) నియమితులయ్యారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన జట్టు మేనేజర్ శ్రీ ప్రశాంత్ మార్గదర్శకత్వంలో అత్యుత్తమ ప్రదర్శన కోసం ఎదురు చూస్తోంది. ఆసియా కప్ లో భారీ పోటీని ఎదుర్కోనుంది టీమిండియా.
PVR Prashanth As a Team India Manager
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లు కార్యదర్శి సనా సతీష్ బాబు, అధ్యక్షుడు సిహెచ్ కేశినేని చిన్ని ప్రశాంత్ నియామకంపై వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక నామినేషన్ పై బిసిసిఐ పివిఆర్ ప్రశాంత్ ను అభినందించింది. ఇదిలా ఉండగా భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను నియమించింది. ఎవరూ ఊహించని రీతిలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు చోటు కల్పించింది.
ఇదిలా ఉండగా టీమిండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాగా వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్తిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ) , జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , సంజూ శాంసన్ (వికెట్ కీపర్ ) , హర్షిత్ రానా, రింకూ సింగ్ ఉన్నారు. అయితే అనూహ్యంగా యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేయక పోవడం ఆశ్చర్య పరిచింది. తనకు కొంత కాలం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అజిత్ అగార్కర్.
Also Read : ED Shocking – MLA KC Veerendra Arrest : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర అరెస్టు
