Shashi Tharoor Shocking Comments : భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలి – థ‌రూర్

అమెరికా సుంకాల విధింపుపై తీవ్ర ఆగ్ర‌హం

Hello Telugu - Shashi Tharoor Shocking Comments

Hello Telugu - Shashi Tharoor Shocking Comments

Shashi Tharoor : న్యూఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అమెరికా కావాల‌ని భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాపై 50 శాతం సుంకాల‌ను విధించ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చర్చలు ఫలించక పోతే అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకాలను విధించడం ద్వారా డోనాల్డ్ ట్రంప్ సుంకాల దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలని మోదీకి పిలుపునిచ్చారు. ముందుగా త‌న‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌న్నారు. చైనాకు 90 రోజుల గ‌డువు ఇచ్చార‌ని, కానీ ఇండియాకు ఈ విష‌యంలో 21 రోజులే ఎందుకు టైమ్ లైన్ పెట్టారో నిగ్గ‌దీసి ప్ర‌శ్నించాల‌న్నారు.

Shashi Tharoor Key Comments on America

భారతదేశం ప్రస్తుతం అమెరికా దిగుమతులపై 17 శాతం సుంకాలను వసూలు చేస్తుందని చెప్పారు ఎంపీ శ‌శి థ‌రూర్ (Shashi Tharoor). మ‌నం కూడా యుఎస్ కు షాక్ ఇవ్వాలి. 50 శాతం మ‌నం పెంచి అమెరికాపై దెబ్బ కొట్టాల‌న్నారు. అయితే ర‌ష్యా నుండి చ‌మురు భార‌త్ కొనుగోలు చేయ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. దీనికి ప్ర‌తీకార చ‌ర్య‌గా సుంకాల విధింపు మొద‌ట 25 శాతం పెంచ‌గా మ‌రో సారి 25 పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది వెంట‌నే అమ‌లులోకి వ‌స్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ట్రంప్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. రైతులు, మ‌త్స్య‌కారుల కోసం తాను త‌ల‌వంచ‌న‌ని అన్నారు పీఎం.

రైతుల ప్రయోజనాలే మా ప్రధానం. భారతదేశం తన రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీపడదు. దీనికి నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను సిద్ధంగా ఉన్నానని ప్ర‌క‌టించారు.

Also Read : PM Modi Warning : డొనాల్డ్ ట్రంప్ కి ప్ర‌ధాని మోదీ వార్నింగ్

Exit mobile version