PM Modi Warning : డొనాల్డ్ ట్రంప్ కి ప్ర‌ధాని మోదీ వార్నింగ్

సుంకాలు విధించ‌డం పై తీవ్ర ఆగ్ర‌హం

Hello Telugu - PM Modi Warning

Hello Telugu - PM Modi Warning

PM Modi : ఢిల్లీ – నిన్న‌టి దాకా త‌న మిత్రుడంటూనే పాకిస్తాన్ కు మేలు చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). భార‌త్ పై నిత్యం విషం క‌క్కుతూ వ‌స్తున్న ట్రంప్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . భార‌త్ పై మ‌రోసారి 25 శాతం సుంకాల‌ను విధిస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. భారత్ తొలి ప్రాధాన్యం రైతుల కేన‌ని స్ప‌ష్టం చేశారు. అన్న దాత, మృత్యాకారుల, పశు పోషకుల విషయాల్లో రాజీ పడేది లేదన్నారు. అందువల్ల నేను వ్యక్తి గతంగా ఇబ్బందులు పడొచ్చు. ఐనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ సుంకాలపై ప్రధాని మోదీ బలమైన సందేశం ఇచ్చారు.

PM Modi Strong Warning

భారతదేశం తన రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీపడదని నొక్కి చెప్పారు. ధర చెల్లించాల్సి ఉంటుందని తనకు తెలిసినప్పటికీ, రైతుల కోసం దానిని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రక‌టించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించారు. రైతుల‌ ప్రయోజనాలే మా ప్రధాన ప్రాధాన్యత అని స్ప‌ష్టం చేశారు. భారతదేశం తన రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీ ప‌డ‌బోద‌ని పేర్కొన్నారు. నేను వ్యక్తిగతంగా దీనికి భారీ ధర చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు స్వామినాథ‌న‌న్ ను స్మ‌రించుకున్నారు. ఇదిలా ఉండ‌గా రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగించినందుకు జరిమానా’గా భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని డోనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు. అంతకు ముందు, జూలై 20న అమెరికా భారత ఎగుమతులపై 25 శాతం సుంకాలను విధించింది.

Also Read : BJP Chief Madhav – AP Growth : కేంద్రం స‌హ‌కారం ఏపీకి ప్రోత్సాహం

Exit mobile version