Shami : ముంబై : ఇండియన్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Shami) సంచలన కామెంట్స్ చేశారు. తను ఏకంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లపై ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తాను ఫిట్ నెస్ తోనే ఉన్నప్పటికీ తనను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోక పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు అగార్కర్ వింత సమాధానం ఇచ్చారు. తను ఫిట్ గా ఉన్నాడనే దానిపై ఇంకా తమకు సమాచారం అందలేదంటూ పేర్కొన్నాడు. తప్పించుకునే ప్రయత్న చేశాడు. విచిత్రం ఏమిటంటే తన కంటే పర్ ఫార్మెన్స్ విషయంలో వెనుకబడి ఉన్న హర్షిత్ రాణాను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Shami Slams Agarkar
ఇదే సమయంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ విషయంలో కూడా ఇలాగే జరిగిందంటూ పెద్ద ఎత్తున మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అయినా అగార్కర్, గంభీర్ పట్టించుకోవడం లేదు. తాజాగా మహమ్మద్ షమీ చేసిన కామెంట్స్ బీసీసీఐలో , క్రికెట్ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని, కేవలం తమకు నచ్చిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా షమీ మాట్లాడుతూ తన ఫిట్ నెస్ గురించి అప్ డేల్ లేదంటూ చెప్పడం పట్ల మండిపడ్డారు. మీరు అడగాలే తప్పా తాను ఎలా చెబుతానంటూ ప్రశ్నించాడు షమీ.
Also Read : Dr APJ Abdul Kalam Great Inspiration : మహోన్నత మానవుడు అబ్దుల్ కలాం
