మహీకా శ‌ర్మ‌తో క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం

దాదాపు మూడు సంవ‌త్స‌రాల ప్రేమ‌ ప్ర‌యాణం

hellotelugu-HardikPaandya

ముంబై : భార‌త క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ , ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా . త‌ను ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా త‌ను మ‌హీకా శ‌ర్మ‌తో డేటింగ్ లో ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు ఇవాళ త‌న ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. దాదాపు కొన్నేళ్ల బంధం త‌ర్వాత‌ హార్దిక్ తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. హార్దిక్ పాండ్యా 3 సంవత్సరాల పాటు లోతైన పరిశోధన చేస్తూ, సాధ్యమయ్యే ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ, పరిస్థితిని విశ్లేషించి, చివరకు తన జీవితంలోనే అతిపెద్ద నిబద్ధతతో కూడిన నిర్ణయం తీసుకున్నాడు.

క్రికెట్‌లోని విధ్వంసకర ఇన్నింగ్స్‌ల నుండి ప్రేమ ఇన్నింగ్స్‌ల వరకు, హార్దిక్ మైదానం వెలుపల ఒక సరికొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు. కొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకున్న నిర్ణయాలే అత్యంత సంతోషకరమైన క్షణాలకు దారితీస్తాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు పుణ్య క్షేత్రాల‌ను సంద‌ర్శించాడు కూడా. గ‌తంలో త‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. క్రికెట్ లో టాప్ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ ప్రేమ‌, పెళ్లి ప‌రంగా త‌ను స‌క్సెస్ కాలేక పోయాడు. పాండ్యా , శ‌ర్మ‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి.

మ‌రో వైపు కొన్ని రోజుల క్రితం హార్దిక్ పాండ్యా మహీకా శర్మతో కలిసి రొమాంటిక్ వెకేషన్‌కు వెళ్లిన చిత్రాలు , వీడియోలను పంచుకున్నారు. ఈ వీడియోలలో ఒకదానిలో, హార్దిక్ తన లంబోర్ఘిని కారును కడుగుతుండగా, పక్కనే నిలబడి ఉన్న మహీకా సరదాగా పైపుతో అతనిపై నీళ్లు చల్లుతూ కనిపించింది. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతూ, సరదాగా గడుపుతూ కనిపించారు.అదే పోస్ట్‌లో, హార్దిక్ మహీకాతో కలిసి సముద్ర తీరంలో సెలవులను గడుపుతున్న చిత్రాలను కూడా పంచుకున్నారు, అందులో ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కనిపించారు.

Exit mobile version