Dr APJ Abdul Kalam : హైదరాబాద్ : భారత దేశం గర్వించదగిన అరుదైన నాయకుడు , మహోన్నత మానవుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (Dr APJ Abdul Kalam) జయంతి ఇవాళ. శాస్త్రవేత్తగా, టీచర్ గా , మార్గదర్శకుడిగా కోట్లాది మందిని ప్రభావితం చేశారు. దేశ రాష్ట్రపతిగా ఆ పదవికి వన్నె తీసుకు వచ్చారు. తను రాష్ట్రపతి భవన్ ను ఖాళీ చేస్తూ ఎలాంటి సామాన్లను కూడా తీసుకు వెళ్లని నాయకుడు ఆయన. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. అన్నింటికంటే మించి భారతదేశ పురోగతి, ఆవిష్కరణ , స్వావలంబన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన దేశభక్తుడు కలాం.
Dr APJ Abdul Kalam Inspiring
ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరి తరపున మాజీ దివంగత రాష్ట్రపతికి హృదయ పూర్వక నివాళులు. కలలు కనండి, వాటిని నిజం చేసేందుకు ప్రయత్నం చేయండి అంటూ తన జీవితకాలం అంతా ప్రయోగాలకు అంకితం చేసిన అరుదైన వ్యక్తి కలాం. వినయం, నిబద్దత, అంకిత భావం, ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన ఈ మానవతా మూర్తి నిజంగా ధన్యుడు. ఈ దేశం ఉన్నంత వరకు, లోకం ఉన్నంత వరకు కలాం బతికే ఉంటాడు.
తమిళనాడులోని రామేశ్వరం ధనుష్కోడి తన స్వస్థలం. అక్టోబర్ 31, 1931లో కడు పేద కుటుంబంలో పుట్టాడు. ఇంటింటికి తిరుగుతూ పేపర్లు వేస్తూ చదువుకున్నాడు. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని చేపట్టారు. అంతే కాదు టీచర్ గా పాఠాలు చెప్పారు. సైంటిస్టుగా దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ క్షిపణి వ్యవస్థలో ఇండియాకు సమున్నత స్థానం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు అబ్దుల్ కలాం. జూలై 27, 2015లో ఈ లోకాన్ని వీడాడు. తను వెళ్లి పోయి 10 ఏళ్లవుతోంది. ఇలాంటి వ్యక్తి ఈ నేల మీద పుట్టడం ఈ దేశానికి గర్వ కారణం.
Also Read : KTR Fired on Congress : ఓట్ల చోరీ నిజం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం
