Hero Shah Rukh Khan : జాతీయ అవార్డుకు బాద్ షా అర్హుడు

ప్ర‌శంస‌లు కురిపించిన ముఖేష్ ఖ‌న్నా

Hello Telugu - Hero Shah Rukh Khan

Hello Telugu - Hero Shah Rukh Khan

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా , సూప‌ర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కు ఊహించ‌ని విధంగా జాతీయ స్థాయిలో అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ చిత్రంలో అద్బుత‌మైన రోల్ పోషించాడు. ఈ సంద‌ర్బంగా 71వ జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది కేంద్ర స‌ర్కార్. ఇందులో అత్యుత్త‌మమైన పుర‌స్కారం ద‌క్కింది. త‌న‌ను ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో ఎంపిక చేసింది. దీనిపై కొంద‌రు సినీ రంగానికి చెందిన వారు షారుక్ ఖాన్ కు పుర‌స్కారం ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు.

దీనిపై ప్ర‌ముఖ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా తీవ్రంగా స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు అవార్డు రావ‌డం స‌బ‌బేన‌ని పేర్కొన్నాడు. గత 40 సంవత్సరాలుగా ఆయన కష్టపడి పనిచేస్తూ వ‌చ్చార‌ని కొనియాడారు. జ‌వాన్ మూవీలో కీల‌క రోల్ పోషించాడు. ఆ పాత్ర‌కు త‌ను వంద శాతం న్యాయం చేశాడు. ప్రేక్ష‌కులు త‌న న‌ట‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అంతే కాదు ఆ మూవీ ఏకంగా రూ. 1000 కోట్ల‌ను వ‌సూలు చేసింది. షారుక్ ఖాన్ సినీ కెరీర్ లో ఇది ది బెస్ట్ మూవీగా నిలిచింద‌న్నారు ఖ‌న్నా.

Shah Rukh Khan – National Award

ఈ అవార్డు గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది, ఆయన అవార్డు అందుకున్న సమయం, చిత్రం ఎంపికను పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రశ్నించారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ముఖేష్ ఖన్నా రంగంలోకి దిగారు. షారూఖ్ ఖాన్ కు ఈ సినిమా (జవాన్) కి కాకుండా స్వదేశ్ కి అవార్డు వచ్చి ఉండాల్సిందని పేర్కొన‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు . త‌ను సృష్టించిన ‘జై హో’ కి ఆస్కార్ అందుకున్నారని గుర్తుంచు కోవాల‌న్నాడు. ఆయనకు జాతీయ అవార్డు వస్తే తప్పేంటి అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్బంగా షారుక్ ఖాన్ స్పందించాడు. నా జీవితం మొత్తం సినిమాతోనే ముడి ప‌డి ఉంద‌న్నాడు. శబ్దంతో నిండిన ప్రపంచంలో నిల‌బ‌డ‌టం ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : Hero Vijay Sethupathi-Casting Couch : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విజ‌య్ సేతుప‌తి

Exit mobile version