మెస్సీ కోసం కోల్ క‌తాకు చేరుకున్న షారుక్ ఖాన్

చిన్న కుమారుడు అబ్ రామ్ తో క‌లిసి టూర్

hellotelugu-ShahrukkhKhan

కోల్ క‌తా : ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ శనివారం ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. మెస్సీ గోట్ టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఇక్క‌డ ప‌ర్య‌టించేందుకు వ‌స్తున్నారు. భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నారు స్పాన్స‌ర్స్. త‌న టూర్ లో భాగంగా హైద‌రాబాద్, ముంబై, కోల్ క‌తా, ఢిల్లీ న‌గ‌రాల‌లో ప‌ర్య‌టిస్తారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. టూర్ లో భాగంగా శనివారం హైద‌రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి నేరుగా చౌమొహ‌ల్లా ప్యాలెస్ కు హాజ‌ర‌వుతారు. రాత్రి ఉప్ప‌ల్ స్టేడియంకు వెళతారు. అక్క‌డి నుంచి కోల్ క‌తాకు వెళ్ల‌నున్నారు. మెస్సీ పాల్గొనే కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా హాజ‌ర‌వుతున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ . ఇందులో భాగంగా ఇవాళ ఖాన్ తో పాటు త‌న త‌న‌యుడు అబ్ రామ్ తో క‌లిసి కోల్ క‌తాలో కాలు మోపారు.

కోల్ క‌తా ఎయిర్ పోర్టు చేరుకున్న విజువ‌ల్స్, ఫోటోలు పెద్ద ఎత్తున వైర‌ల్ గా మారాయి. సాల్ట్ లేక్ స్టేడియంలో క‌లుద్దాం అంటూ ప్ర‌ముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు షారుక్ ఖాన్. అర్జెంటీనా ఐకాన్ ను చూసేందుకు వేలాది మంది ఇప్ప‌టికే గుమిగూడారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు స‌మావేశాలతో ప్రారంభ‌మ‌య్యే రోజంతా న‌గ‌రం మెస్సీకోసం పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండ‌గా కోల్ క‌తా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా మెస్సీ భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీతో పాటు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మతా బెన‌ర్జీని కూడా క‌లుస్తారు.

Exit mobile version