Popular Journalist Krishnam Raju : సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు విడుద‌ల

గుంటూరు కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్

Hello Telugu - Popular Journalist Krishnam Raju

Hello Telugu - Popular Journalist Krishnam Raju

Journalist Krishnam Raju : గుంటూరు జిల్లా – రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు (Journalist Krishnam Raju) ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు త‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని, వారంలో ఒక రోజు ద‌ర్యాప్తు అధికారి ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది కోర్టు.

Journalist Krishnam Raju Release

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భార‌తీ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న సాక్షి టీవీ ఛాన‌ల్ లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ , యాంక‌ర్ కొమ్మినేని శ్రీ‌నివాస రావు డిబేట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా చ‌ర్చా వేదిక‌లో పాల్గొన్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణం రాజు. అమ‌రావ‌తి రాజ‌ధాని వేశ్య‌ల‌కు కేరాఫ్ గా మారిందంటూ నోరు పారేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా తాను కావాల‌ని కామెంట్ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు. త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూనే కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక బాధ్య‌త క‌లిగిన జ‌ర్న‌లిస్ట్ గా ఉంటూ ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది.

Also Read : CM Chandrababu Strong Commitment : ప్ర‌జా సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం – సీఎం

Exit mobile version