CM Chandrababu Strong Commitment : ప్ర‌జా సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం – సీఎం

కుప్పంకు ఎయిర్ పోర్ట్ ..ఆల‌యాల అభివృద్దికి రూ. 50 కోట్లు

Hello Telugu - CM Chandrababu Strong Commitment

Hello Telugu - CM Chandrababu Strong Commitment

CM Chandrababu : చిత్తూరు జిల్లా – సంక్షేమం , అభివృద్ది త‌మ ప్ర‌భుత్వం ప్ర‌ధాన ఎజెండా అని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). గ‌త ప్ర‌భుత్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింద‌ని, వాటిని చ‌క్క‌దిద్దేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. తాను కుటుంబానికి పెద్ద కొడుకు లాగా సేవ చేస్తున్నాన‌ని, రేయింబ‌వ‌ళ్లు నిద్ర‌హారాలు మాని ఏపీ అభివృద్ది కోసం ఆలోచిస్తున్నాన‌ని చెప్పారు. యావ‌త్ దేశం కుప్పం వైపు చూసేలా చేస్తాన‌ని, అంత వ‌ర‌కు తాను నిద్ర పోనంటూ ప్ర‌క‌టించారు.

CM Chandrababu Strong Challenge

త‌మ‌ది డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అని, ఎక్క‌డా రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. నేరాలు చేసిన వాళ్లు త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆరోప‌ణ‌లు దారుణ‌మ‌న్నారు. ఇప్పుడున్న‌ది 2014 సీఎం కాద‌ని 1995 ముఖ్య‌మంత్రి అన్నారు. కుప్పంలో ఎయిర్ పోర్ట్ ను తీసుకు వ‌స్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఏకంగా రూ. 850 కోట్ల‌తో ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా త‌మ‌కు చెందిన భూముల‌ను ఇవ్వాల‌ని కోరారు. మ‌రింత మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పారు. కొంద‌రు కావాల‌ని చిచ్చు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఆల‌యాల అభివృద్దికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అద్భుత‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అభివృద్దికి, సంక్షేమానికి సైకిలే బెస్ట్ అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ.. సంక్షేమం అభివృద్ధి చేపడుతున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రూ.1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కుప్పంలో రూ.1271.65 కోట్ల పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.

Also Read : TTD Strong Action : భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు – టీటీడీ

Exit mobile version