డిసెంబ‌ర్ నాటికి ఇండియా ఈయుతో ఒప్పందం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్

hellotelugu-PiyushGoyal.j

New Delhi, March 31 (ANI): Union Railway Minister Piyush Goyal addresses media during a press conference on cabinet decisions, in New Delhi on Wednesday. (ANI Photo)

న్యూఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ నాటికి భారత్- ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామ‌న్నారు. ఈ ఒప్పందం 2027 ఫిబ్రవరి-మార్చి నుండి అమలులోకి రానుంద‌ని చెప్పారు. దీని కింద దాదాపు 93 శాతం భారతీయ ఎగుమతులు 27 దేశాల కూటమికి ఎటువంటి సుంకం (పన్ను) లేకుండా ప్రవేశం పొందుతాయి. వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం మాట్లాడారు. భారత్ తో పాటు 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ డిసెంబర్ నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న, ‘అత్యంత కీలకమైన ఒప్పందం కోసం చర్చలు పూర్తయినట్లు భారత్ , ఈయు ప్రకటించాయి. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన సమావేశంలో గోయల్ పాల్గొన్నారు.

ఇప్పుడు దాదాపు సున్నా సుంకంతో, యూరోపియన్ మార్కెట్ మొత్తం మనకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఈయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబర్ నాటికి కుదురుతుంది అని తెలిపారు. ఫిబ్రవరి-మార్చి నాటికి అమల్లోకి వస్తుంది అని అన్నారు. అలాగే, తనతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరపడానికి అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఈ వారం భారత్‌కు వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 93 శాతం భారతీయ ఎగుమతులు 27 దేశాల కూటమికి సుంకం రహిత ప్రవేశాన్ని పొందుతాయని చెప్పారు పీయూష్ గోయ‌ల్.

Exit mobile version