Sara Tendulkar Growth : ఆస్ట్రేలియా కంపెనీకి సారా టెండూల్క‌ర్ బ్రాండ్ అంబాసిడ‌ర్

ఆస్ట్రేలియన్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిపా హారిసన్

Hello Telugu - Sara Tendulkar

Hello Telugu - Sara Tendulkar

Sara Tendulkar : ముంబై – ప్ర‌ముఖ దిగ్గ‌జ మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ముద్దుల కూతురు సారా టెండూల్క‌ర్ సంచ‌ల‌నంగా మారారు. త‌నకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా క‌మ్ అండ్ సే జిడేకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపికైంది. 130 మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌చారం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌ధానంగా ఆస్ట్రేలియా స‌ర్కార్ విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ప్లాన్ చేసింది. ఇందు కోసం సారా టెండూల్క‌ర్ (Sara Tendulkar) తో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు ఈ సంస్థ‌కు ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇది ఆగ‌స్టు 7న చైనాలో ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించారు ఆస్ట్రేలియా టూరిజం మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఫిలిపా హారిస‌న్.

Sara Tendulkar As a Australian Company Brand Ambassidor

ఆస్ట్రేలియా టూరిజం అభివృద్ది కోసం అమెరికా, ఇంగ్లండ్, చైనా, ఇండియా, జ‌పాన్ లోని వారిని ఆక‌ర్షించేందుకు వీరు కృషి చేయ‌నున్నారు. ఇందులో భాగంగా స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్ ఇందులో భాగం కాబోతోంద‌ని తెలిపారు హారిస‌న్. అమెరికాలో అంబాసిడ‌ర్ గా జంతు సంర‌క్ష‌ణ కారుడు స్టీవ్ ఇర్విన్ కొడుకు రాబ‌ర్ట్ ఇర్విన్ ఉంటారు. జ‌పాన్ కు చెందిన క‌మెడియ‌న్ అబ‌రేరుకున్, చైనాలో న‌టి యోష్ యు, యుకెలో వంట‌కాల రైట‌ర్ , టీవీ కుక్ నెగెల్లా బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. వీరితో పాటు ఆస్ట్రేలియాలో టాప్ హీరో గా పేరు పొందిన థామ‌స్ వెద‌రాల్ కూడా వీరితో జ‌త‌క‌డ‌తారు.

Also Read : AP Govt New Innovation : ఆగస్టు 15 నుంచి ఆన్ లైన్లో 700 ప్రభుత్వ సేవలు

Exit mobile version