Popular Cricketer Samson : 31 సిక్సులతో శాంస‌న్ సెన్సేష‌న్

బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌కు కోలుకోలేని షాక్

hellotelugu-sanjusamson

Samson : కేర‌ళ సూప‌ర్ స్టార్ సంజూ శాంస‌న్ (Samson) సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. తాజాగా ఆసియా క‌ప్ లో ఎంపిక చేసిన భార‌త క్రికెట్ జ‌ట్టు ఎంపిక చేసింది. ఇందులో గ‌త్యంత‌రం లేక బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ శాంస‌న్ కు చోటు క‌ల్పించింది. ఈ త‌రుణంలో త‌న స‌త్తా ఏమిటో నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటి చెప్పాడు. కేర‌ళ క్రికెట్ లీగ్ (కేసీఎల్)లో దుమ్ము రేపాడు. ఆడిన ప్ర‌తి ఇన్నింగ్స్ లో సూప‌ర్ షో చేశాడు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. 51 బంతులు ఆడి సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. 121 ప‌రుగుల‌తో ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు 48 బంతులు ఎదుర్కొని 89 ర‌న్స్ చేశాడు. మ‌రో మ్యాచ్ లో 37 బాల్స్ ఎదుర్కొని 62 ప‌రుగులు చేస్తే కీల‌క మ్యాచ్ లో 41 బాల్స్ లో 83 కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్ ల‌లో 350 ర‌న్స్ చేశాడు.

Samju Samson New Record

శుభ్‌మాన్ గిల్, జితేష్ శర్మతో కలిసి భారత ఆసియా కప్ ఎలెవన్ జట్టుపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తాడు సంజూ శాంస‌న్. వరుస అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ముఖ్యాంశాలలో నిలిచాడు, తిరువనంతపురంలో కొచ్చి బ్లూ టైగర్స్ బ్యాట్స్‌మన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సుల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఆరీస్ కొల్లం సెయిలర్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 14 ఫోర్లు , 7 సిక్సుల‌తో విరుచుకు ప‌డ్డాడు. 190 కంటే స్ట్రైక్ రేట్ తో సంచ‌ల‌నం సృష్టించాడు. దీంతో ఆసియా క‌ప్ లో టీమిండియా తుది జ‌ట్టులోకి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించాడు బీసీసీఐకి.

Also Read : Indian Railways Interesting Offer : ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ

Exit mobile version