Indian Railways : పండుగ సీజన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, రెండు వైపులా (అప్ & డౌన్) టిక్కెట్లను ఒకేసారి బుక్ చేసుకుంటే 20 శాతం ప్రత్యక్ష రాయితీ లభించనుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి రైల్వేలు “RailOne” అనే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, రైల్వే (Indian Railways) స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ ద్వారా కూడా ఈ సౌకర్యం పొందవచ్చు.
Indian Railways – ఆఫర్ వర్తించే తేదీలు
- బయలుదేరే ప్రయాణం: అక్టోబర్ 13 – అక్టోబర్ 26, 2025
- తిరుగు ప్రయాణం: నవంబర్ 17 – డిసెంబర్ 1, 2025
ఈ తగ్గింపును పొందాలంటే రెండు టిక్కెట్లను ఒకేసారి బుక్ చేయాలి. ప్రయాణ స్టేషన్, రైలు తరగతి, ప్రయాణికుల సంఖ్య రెండింటికీ ఒకేలా ఉండాలి. వేర్వేరు రోజుల్లో లేదా విడిగా టిక్కెట్లు తీసుకుంటే డిస్కౌంట్ వర్తించదు.
RailOne యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఇలా
- ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ అందుబాటులో ఉన్న RailOne యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్‌లో mPIN లేదా వేలిముద్రతో లాగిన్ కావచ్చు.
- హోమ్‌పేజీలో కనిపించే “Avail Festive Package” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మొదట బయలుదేరే ప్రయాణ వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాలి.
- తర్వాత “Book Return Ticket (20% Discount)” ఎంపికను ఎంచుకోవాలి.
- సిస్టమ్ ఆటోమేటిక్‌గా స్టేషన్, క్లాస్, ప్రయాణికుల వివరాలను పూరిస్తుంది.
- తిరుగు తేదీని ఎంచుకొని చెల్లింపు చేసిన వెంటనే టిక్కెట్‌పై నేరుగా 20% తగ్గింపు లభిస్తుంది.
కౌంటర్‌లో కూడా లభ్యం
యాప్ ఉపయోగించకూడదనుకునే ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లోనూ ఈ పథకం ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే రెండు ప్రయాణాల టిక్కెట్లను ఒకేసారి తీసుకోవాల్సిందే.
అదనపు సౌకర్యాలు
RailOne యాప్ ద్వారా టిక్కెట్లతో పాటు రైలు లోకేషన్ స్టేటస్, ఆహారం ఆర్డర్ చేయడం, టాక్సీ బుకింగ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.
Also Read : Interesting Updates on IPO’s : సెప్టెంబర్ 1 నుండి మొదలు కానున్న కొత్త ఐపీఓలు
