ఆస్ట్రేలియా సీరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

భార‌త మ‌హిళా జ‌ట్టులో మ‌మ‌త‌కు చోటు

hellotelugu-BCCIAnnounce

ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆస్ట్రేలియా – ఎ మహిళా జట్టు భారత్‌లో జరపనున్న పర్యటన కోసం ఎంపిక చేసిన ఇండియా – ఎ జట్టులో హైదరాబాద్ క్రీడాకారిణి మమత మడివాలకు చోటు దక్కింది. వికెట్ కీపర్ అయిన మమత, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ వరకు జరగనున్న మ్యాచ్‌లో ఆడనుంది. ఈ పర్యటనలో మూడు T20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 12, 15 , 17 తేదీల్లో న్యూ చండీగఢ్‌లో జరుగుతాయి; అలాగే మూడు వన్డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పీసీఏ స్టేడియంలో జరుగుతాయి. బీసీసీఐ ఆసియా క్రీడలకు సంబంధించి బి టీంను పంపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

బహుళ-రోజుల మ్యాచ్ కోసం ఇండియా – ఎ జ‌ట్టు ఇలా ఉంది. యస్తిక భాటియా (కెప్టెన్, వికెట్ కీపర్), అనుష్క శర్మ (వైస్ కెప్టెన్), శుభ సతీష్, ప్రియా పునియా, తనిషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, మమత మడివాల (వికెట్ కీపర్), సుశ్రీ దివ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌ఘరే, జింతిమని కలిత, షబ్నం షకీల్, అక్షిత భగత్.

ఇక T20ల కోసం ఇండియా – ఎ జట్టు : అనుష్క శర్మ (కెప్టెన్), సయాలి సత్‌ఘరే (వైస్ కెప్టెన్), బృంద దినేష్, సుజాత డే, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, షిప్రా గిరి (వికెట్ కీపర్), శ్వేత సెహ్రావత్, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), తనుజ కన్వర్, మిన్ను మణి, వైష్ణవి శర్మ, జింతిమని కలిత, షబ్నం షకీల్, సిమ్రాన్ దిల్ బహదూర్.

వన్డే మ్యాచ్‌లకు భారత్ ‘ఎ’: యాస్తిక భాటియా (కెప్టెన్, వికెట్ కీపర్), అనుష్క శర్మ (వైస్ కెప్టెన్), వృందా దినేష్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మిన్ను మణి, అమన్‌దీప్‌ శర్మ, వైష్ణలీవి శర్మ, వైష్ణీదీప్‌ శర్మ, వైష్ణీదీప్‌ శర్మ, షబ్నం షకీల్, అక్షితా భగత్.

Exit mobile version