ముంబై : తనను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్న ఊహించని నిర్ణయంపై బహిరంగంగా స్పందించారు భారత టి20 జట్టు మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. కనీసం మరో రెండేళ్లపాటు భారత జట్టుకు నాయకత్వం వహిస్తానని భావించినప్పటికీ, సెలెక్టర్ల ఆలోచనలు వేరుగా ఉన్నాయని ఈ బ్యాటర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా భారత్ మూడుసార్లు T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ తొలి టైటిల్‌ను సాధించగా, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరిగిన టోర్నమెంట్‌లో విజయం సాధించడం ద్వారా T20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు.
భారత్‌ను T20 ప్రపంచ కప్ విజేతగా నిలిపినప్పటికీ, ఆ టోర్నమెంట్ తర్వాత జరిగిన సిరీస్ కోసం సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి ఆశ్చర్యకరంగా తప్పించారు బీసీసీఐ సెలెక్టర్లు. ఈ నిర్ణయం కారణంగా ఆయన భారత ప్లేయింగ్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేక పోయారు. మాజీ భారత క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ పరిణామం గురించి మాట్లాడుతూ, ఆ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని సూర్యకుమార్ అంగీకరించారు. కనీసం మరో రెండేళ్లపాటు భారత T20 కెప్టెన్‌గా కొనసాగుతానని తాను భావించినట్లు పేర్కొన్నారు.
జట్టు జాబితాలో తన పేరు లేకపోవడాన్ని చూసిన క్షణాన్ని గుర్తు చేసుకున్న సూర్యకుమార్ తాను ఆ నిర్ణయాన్ని చిరునవ్వుతోనే దానికి స్పందించానని చెప్పారు.
