Popular Cricketer Sanju Samson : సియ‌ట్ టి20 బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా శాంస‌న్

ఈ అవార్డును త‌న భార్య చారుకు అంకితం

Hello Telugu - Popular Cricketer Sanju Samson

Hello Telugu - Popular Cricketer Sanju Samson

Sanju Samson : ముంబై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌నకు అరుదైన గుర్తింపు ల‌భించింది.సియ‌ట్ టి20 బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి క్రికెట‌ర్లు శ్రేయాస్ అయ్య‌ర్, రోహిత్ శ‌ర్మ‌తో పాటు ప్ర‌ముఖ క్రికెట్ లెజండ్ బ్రియాన్ లారా కూడా హాజ‌ర‌య్యాడు. ఈ సందర్భంగా అవార్డును తీసుకున్న అనంత‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు సంజూ శాంస‌న్ (Sanju Samson). ఈ పుర‌స్కారాన్ని త‌న భార్య చారుకు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న విజ‌యం వెనుక త‌న భార్య ఉంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా కెరీర్ ప‌రంగా చూస్తే శాంస‌న్ అద్బుతంగా రాణించాడు. త‌ను గ‌త 12 నెల‌ల కాలంలో సూప‌ర్ షో చేశాడు. క‌ళాత్మ‌క‌మైన షాట్స్ తో అల‌రించాడు.

Sanju Samson Gets Appreciation

ఇన్నింగ్స్ ఓపెనర్ గా ప్రమోట్ చేయబడిన తర్వాత అతను 12 ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు చేశాడు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో సియ‌ట్ పురుషుల టి20 అవార్డు ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. శాంస‌న్ 37.90 సగటుతో , 183.70 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 417 పరుగులు చేశాడు. సామ్సన్ , అభిషేక్ శర్మ తమను తాము బలమైన ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్నారు, అత్యంత తీవ్రమైన బౌలింగ్ దాడులను కూడా నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు. భార‌త దేశం కోసం మ్యాచ్ ప‌రంగా ఏ స్థానంలో ఆడేందుకైనా తాను సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు.

Also Read : Zubeen Garg Death Updates : సింగ‌ర్ జుబీన్ గార్గ్ కేసులో బోకో ఎస్పీ అరెస్ట్

Exit mobile version