Zubeen Garg Death Updates : సింగ‌ర్ జుబీన్ గార్గ్ కేసులో బోకో ఎస్పీ అరెస్ట్

అదుపులోకి తీసుకున్న ద‌ర్యాప్తు సంస్థ

Hello Telugu - Zubeen Garg Death Updates

Hello Telugu - Zubeen Garg Death Updates

Zubeen Garg : అస్సాం : అస్సాం భూమి పుత్రుడు, ప్ర‌ముఖ గాయ‌కుడు జుబీన్ గార్గ్ ఇటీవ‌లే సింగ‌పూర్ లో ఓ కార్య‌క్ర‌మానికి వెళ్లి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపేలా చేసింది. ఆయ‌న అంతిమ యాత్ర‌కు ఊహించని రీతిలో వేలాది మంది జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. క‌న్నీటి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా అస్సాం వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. జుబీన్ గార్గ్ (Zubeen Garg) స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, త‌న మృతి వెనుక ఏదో దాగి ఉందంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. ఆపై త‌న భార్య ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరింది . దీంతో అస్సాం బీజేపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జుబీన్ గార్గ్ మృతిపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌.

Zubeen Garg Death Updates

తాజాగా కేసు ద‌ర్యాప్తు వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. విచార‌ణ‌లో భాగంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జుబీన్ గార్గ్ బంధువు, ప్ర‌స్తుతం అస్సాంలోని బోకో జిల్లాకు ఇన్ ఛార్జ్ ఎస్పీగా ప‌ని చేస్తున్న సందీప‌న్ గార్గ్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. దీంతో జుబీన్ గార్గ్ కేసు కొత్త మ‌లుపు తిరిగింది. త‌ను జుబీన్‌తో కలిసి సింగపూర్‌కు వెళ్లాడు. సెప్టెంబర్ 19న‌ మరణించిన సమయంలో అక్కడే ఉన్నాడని సమాచారం. ఈ అరెస్టు కొనసాగుతున్న దర్యాప్తులో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తోంది. ఈ ఘ‌ట‌న‌ అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా విస్తృత దృష్టిని ఆకర్షించింది. గాయకుడి మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను నిర్ధారించడానికి మరింత విచారణ కొన‌సాగుతోంది. ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది.

Also Read : CM Chandrababu Important Update on Modi : న‌రేంద్ర మోదీ పాల‌న‌కు 25 ఏళ్లు..బాబు కంగ్రాట్స్

Exit mobile version