Sanjay Raut : ముంబై : శివసేన బాల్ థాకరే పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తమ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ఇవ్వకుండా జీవో తీసుకు రావాలని కోరారు. నిషేధం విధించాలని సీఎం సిద్దరామయ్యను కోరారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఖర్గే చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నాయి ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, బీజేపీ శ్రేణులు. ఈ తరుణంలో ప్రియాంక్ ఖర్గే చేసిన కామెంట్స్ పై స్పందించారు సంజయ్ రౌత్ (Sanjay Raut). ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు ముంబైలో.
MP Sanjay Raut Comments
ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గనుక ప్రధానమంత్రి గనుక అయి ఉండి ఉంటే ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి హిందూ సంస్థలు పుట్టుకు వచ్చేవి కావంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో పటేల్ భారీ విగ్రహాన్ని నరేంద్ర మోదీ గుజరాత్ లో నిర్మించారని , ఇదంతా కేవలం ప్రచారం కోసం తప్పా మరోటి కాదన్నారు. . సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) , భారతీయ జనతా పార్టీ (బిజెపి) పుట్టి ఉండేవి కాదని అన్నారు. ఈ విషయాన్ని తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పానని అన్నారు. ఇది పూర్తిగా రికార్డ్ కూడా అయి ఉందన్నారు సంజయ్ రౌత్.
Also Read : Minister Vangalapudi Anitha Interesting Update : అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తాం
