Vangalapudi Anitha : అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సంచలన ప్రకటన చేశారు. సోమవారం అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను ప్రారంభించారు మంత్రితో పాటు డీజీపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 1,011 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సదర్బంగా వంగలపూడి అనిత మాట్లాడారు. పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఇటీవల ఏపీ రాష్ట్రం యోగాలో గిన్నిస్ బుక్ సాధించిందని చెప్పారు. తమకు గర్వ కారణంగా ఉందన్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి.
Home Minister Vangalapudi Anitha Comments
ఏపీ రాజధాని అమరావతి నగరంలో 15 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు. భారీ ఎత్తున నిధులను కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువతీ యువకులు ఎందరో ఉన్నారని అన్నారు. వారిని అన్ని కేటగిరీ స్పోర్ట్స్ లలో పాలు పంచుకునేలా చేస్తామన్నారు. ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందన్నారు. పోలీసులు రేయింబవళ్లు శాంతి భద్రతల కోసం కష్ట పడుతున్నారని ప్రశంసలు కురిపించారు.
Also Read : Popular Child Cricketer Vaibhav : చిచ్చర పిడుగు వైభవ్ కు అరుదైన ఛాన్స్
