Sandeep Sikka Growth – AMFI : ఏఎంఎఫ్ఐ చైర్మ‌న్ గా సందీప్ సిక్కా

ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న బోర్డు

Hello Telugu - Sandeep Sikka Growth - AMFI

Hello Telugu - Sandeep Sikka Growth - AMFI

Sandeep Sikka : ముంబై : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) చైర్మ‌న్ గా సందీప్ సిక్కా (Sandeep Sikka) ఎన్నిక‌య్యారు. సిక్కా గతంలో ఏఎంఎఫ్ఐ ఛైర్మన్‌గా 2013 నుండి 2015 వరకు పనిచేశారు .త‌ను 2009 నుండి ఏఎంఎఫ్ఐ బోర్డులో ఉన్నారు. సంస్థ‌కు సంబంధించి 30వ వార్షిక సర్వసభ్య సమావేశం జ‌రిగింది. బోర్డు సభ్యులు నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ సిక్కాను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ఛైర్మన్‌గా స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

Sandeep Sikka As a AMFI Chairman

ఇదిలా ఉండ‌గా సందీప్ సిక్కా హెచ్ డీ ఎఫ్ సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్ట‌ర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ నవనీత్ మునోత్ స్థానంలో నియమితులయ్యారు. ఇదే స‌మ‌యంలో బంధన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ కపూర్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కపూర్ 2020 నుండి ఏఆర్ఎన్ కమిటీ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. త‌ను 2018 నుండి ఏఎంఎఫ్ఐ బోర్డులో ఉన్నారు. కాగా భౌగోళిక ప్రాంతాలలో మ్యూచువల్ ఫండ్ల పరిధిని విస్తరించడం, పారదర్శకత , నమ్మకం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకెళ్లడానికి ప్ర‌స్తుతం ఎన్నికైన సందీప్ సిక్కాపై ఉంది.

సెబీ , విధాన రూప‌క‌ర్లల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని స్ప‌ష్టం చేశారు నూత‌న చైర్మ‌న్ గా ఎన్నికైన సందీప్ సిక్కా. ఒక పరిశ్రమ సంస్థగా మ్యూచువల్ ఫండ్‌లను కేవలం ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి ఎంపికగా కాకుండా దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మార్చాలని తాము కోరుకుంటున్న‌ట్లు చెప్పారు సిక్కా.

Also Read : Hydraa Protect : 4400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

Exit mobile version