హైదరాబాద్ : భారతీయ సినిమా రంగాన్ని షేక్ చేస్తోంది ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ మూవీ. ఇప్పటికే సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఎవరూ ఊహించని రీతిలో విడుదలైన 10 రోజుల్లోనే రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. ఇది బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ రికార్డ్ . ఇక కథను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే పలువురు సినీ విమర్శకులు, దర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇందులో వివాదాస్పద, దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఓ స్పెషల్ నోట్ కూడా రాశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే క్రమంలో తాజాగా మరో దిగ్గజ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధురంధర్ చిత్రంపై. తను దర్శకత్వం వహించిన యానిమల్ మూవీలో కీ రోల్ పోషించాడు రణ్ వీర్ సింగ్.
ఇదే క్రమంలో తాజాగా ఆదిత్యా ధర్ కు చిక్కాడు. తనతో పాటు వినోద్ ఖన్నా తనయుడు అక్షయ్ ఖన్నా ముఖ్య భూమిక పోషించాడు. రెహమాన్ పాత్రకు ప్రాణం పోశాడు. అద్భుతమైన పాత్ర పోషించాడని కితాబు ఇచ్చాడు. ప్రత్యేకించి దర్శకుడి ప్రతిభా నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించాడు. చెప్పలేని త్యాగాల నిజమైన బరువును ప్రదర్శించినందుకు అభినందించాడు. ఎలాంటి గందరగోళం లేకుండా. సంగీతం, ప్రదర్శనలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అగ్రస్థానంలో ఉన్నాయని ప్రశంసించాడు. ప్రత్యేకించి అక్షయ్ ఖన్నా నటనను ఆకాశానికి ఎత్తేశాడు వంగా సందీప్ రెడ్డి.
