Samsung New Innovation : సాంకేతిక నైపుణ్యాల‌పై శామ్‌సంగ్ శిక్ష‌ణ

ముంబై కేంద్రంగా ప్రారంభించిన సంస్థ

hellotelugu-samsungexpands

Samsung : ముంబై – ప్ర‌ముఖ దిగ్గ‌జ మొబైల్, ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ (Samsung) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రింత సాంకేతిక ప‌రంగా వినియోగ‌దారుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసింది. టెక్నాల‌జీని శాంసంగ్ జోడించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , డిజిట‌ల్ టూల్స్ ల‌లో టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. తన ఉపాధ్యాయ నైపుణ్యాల పెంపు కార్యక్రమాన్ని ముంబైకి విస్తరించింది. 2025 నాటికి 20,000 మంది విద్యావేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుంది శాంసంగ్. ఉపాధ్యాయులు, పాఠశాల నాయకులకు ఉచిత AI, సాంకేతికత , తరగతి గది ఆవిష్కరణ శిక్షణను అందిస్తోంది.

Samsung Company New Innovation

భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ గా పేరు పొందింది శాంసంగ్. గురువారం తన ప్రధాన చొరవ గాలెక్సీ సాధికారత అనే పేరుతో ముంబైలో శిక్ష‌ణ కేంద్రాన్ని ప్రారంభించింది. దీని వ‌ల్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, నిర్వాహకులను డిజిటల్ సాధనాలు , ఆధునిక బోధనా పద్ధతులతో నైపుణ్యాలను పెంచడం ద్వారా తరగతి గదులను మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలో విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, ఇది 250 పాఠశాలలకు చేరుకుంది . 2,700 మందికి పైగా ఉపాధ్యాయులకు మెళ‌కువ‌ల‌ను నేర్పించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మహారాష్ట్ర తో పాటు పొరుగు రాష్ట్రాలలోని 250 పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 350 మందికి పైగా ఉపాధ్యాయులు , పాఠశాల నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ, సిబిఎస్‌ఇ కార్యదర్శి హిమాన్షు గుప్తా, సీనియర్ శామ్‌సంగ్ ఎగ్జిక్యూటివ్‌లు , విద్యా నిపుణులు పాల్గొన్నారు. 2025 నాటికి 20,000 మంది ఉపాధ్యాయులను శక్తివంతం చేయడమే మా దార్శనికత. ఈ ప్రయాణంలో ముంబై ఒక కీలకమైన మైలురాయి కాబోతోంద‌ని అన్నారు శామ్‌సంగ్ ఇండియా బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.

Also Read : Chinta Mohan Fired on TTD : టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం వ‌ద్ద ధ‌ర్నా

Exit mobile version