Chinta Mohan : తిరుపతి – టీటీడీ పరిపాలన భవనం దగ్గర గురువారం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి తనకు బాగా తెలుసన్నారు. ఆమె బలిజ సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుందని తెలిపారు. అయితే శ్రీలక్ష్మి విగ్గులు, ఆమె చీరలు ధరించడం గురించి విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ఆనాటి సీఎం , దివంగత రాజశేఖర్ రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే, అక్కడ సంతకం పెట్టిందని, చేయని నేరానికి జైలుకు వెళ్లిందన్నారు చింతా మోహన్ (Chinta Mohan). మీ వల్ల నష్ట పోయిందంటూ వాపోయారు.
Ex Union Minister Chinta Mohan Dharna
ఐదేళ్లు చీఫ్ సెక్రటరీగా ఉండాల్సిన శ్రీలక్ష్మి ఎంతో కోల్పోయిందన్నారు. ఆమెపై వచ్చిన విమర్శలను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఒకటి కాదు ఇప్పటికి 39వ సారి రావడం టీటీడీ (TTD) పరిపాలన భవనం ముందుకు. పలుమార్లు ఆందోళన చేపట్టినా పట్టించు కోవడం లేదన్నారు చింతా మోహన్. నారా చంద్రబాబు నాయుడు ఆకాశంలో తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కానీ తాము మాత్రం భూమి పైనే ఉన్నామన్నారు. మాలాంటి వారిని కూడా చూడాలని సూచించారు సీఎంకు. ప్రతి ఊరిలో ఎయిర్ పోర్టులు, సి పోర్టులు కడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, మరి పవిత్రమైన తిరుపతిలో ఏమి కడతారో చెప్పి తీరాలన్నారు.
ముంతాజ్ హోటల్ కి భూమి ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు. అలిపిరి వద్ద టిటిడిలో పనిచేసే అర్చకులందరికీ, ఐదేసి సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ. 20 వేలు ఇస్తున్నారని, రుయా ఆస్పత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఈ నెల నుంచి రూ. 18,600/ ఇచ్చేందుకు అగ్రిమెంట్ జరిగిందన్నారు. టీటీడీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, ప్రస్తుతం రూ. 11,600 మాత్రమే ఇస్తున్నారని, ఇది తగదన్నారు. ప్రతినెలా రూ.18,600/ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు చింతా మోహన్.
ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్, రవి, తేజోవతి, ముని శోభ, రావణ్, యార్లగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.
Also Read : AP BJP Interesting Updates : ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ లిస్టు రిలీజ్
