Samshabad Airport : హైదరాబాద్ : రాజీవ్ గాంధీ శంషా బాద్ ఎయిర్ పోర్టులో (Samshabad Airport) గురువారం తెలంగాణ గిగ్ , ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయు) ఫౌండర్ షేక్ సలావుద్దీన్ , జీఎంఆర్ ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సహకారంతో ఈ శ్రామ్ నమోదు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గిగ్, ప్లాట్ ఫారమ్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు . ఇందులో భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ దత్తోపంత్ తేంగడి నేషనల్ బోర్డు ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ (డీఐఎన్బీడబ్ల్యూఈడీ) కూడా పాల్గొంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఈ-శ్రామ్ నమోదు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది.
E-Sharm Enrollment in Samshabad Airport
ఈ శిబిరంలో ఓలా, ఉబెర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు చురుకుగా పాల్గొన్నారు. ఆర్జీఐఏ విమానాశ్రయంలో ఉచిత పార్కింగ్ జోన్‌లలో వేలాది గిగ్ వర్కర్లు ప్రతిరోజూ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రదేశం అవగాహన, నమోదు కార్యక్రమాలకు అనువైన కేంద్రంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు యాప్ ఆధారిత గిగ్ వర్కర్లు ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకొన్నారు. ముఖ్యమైన సామాజిక భద్రతా ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు, కార్మిక రక్షణలు పొందేలా చేస్తుంది.
ఈ సందర్భంలో డీటీఎన్‌బీడబ్ల్యూఈడీ హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ ఇన్‌చార్జ్ ఎం.ఆర్. దేశ్‌పాండే మాట్లాడారు. భారతదేశంలోని అత్యంత రద్దీగల విమానాశ్రయాలలో ఒకటైన RGIAలో ఈ సంయుక్త ప్రయత్నం కార్మిక సంక్షేమం, సామాజిక చేర్పు పట్ల తమ కట్టుబాటును చూపిస్తుందన్నారు. ఈ-శ్రామ్ ద్వారా గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లు భవిష్యత్తుకు రక్షణ కలిగించే ప్రభుత్వ పథకాలతో అనుసంధానం అవుతారన్నారు.
టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ మాట్లాడుతూ గిగ్ , ప్లాట్‌ఫారమ్ వర్కర్లు RGIAలో ప్రయాణికుల రవాణా , దేశ వ్యాప్తంగా సేవల రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ శిబిరం డ్రైవర్లు, డెలివరీ భాగస్వాముల గౌరవం, భద్రత, హక్కులను బలోపేతం చేయడానికి ఒక ముందడుగు అన్నారు.
జీఎంఆర్ ఏజీఎం విమల్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌జీఐఏ విమానాశ్రయంలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు తమ రవాణా వ్యవస్థలో కీలక భాగంగా పని చేస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నామన్నారు.
Also Read : GST on Gold Price : బంగారంపై జీఎస్టీ ఎంతో తెలుసా? అయితే ఇది చుడండి
