IPS Sajjanar Growth : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా స‌జ్జ‌నార్

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా నాగిరెడ్డి

Hello Telugu - IPS Sajjanar Growth

Hello Telugu - IPS Sajjanar Growth

Sajjanar : హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ప‌లువురు సీనియ‌ర్ ఐపీఎస్ ల‌ను మార్చింది. మ‌రోసారి త‌మ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నూత‌న డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డిని నియ‌మించ‌గా కీల‌క‌మైన సంస్థ ఆర్టీసికి మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా నాగిరెడ్డిని నియ‌మించారు. ఇక ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కొన్నేళ్లుగా ఆర్టీసీకి ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తూ, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar) కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న‌ను హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా నియ‌మించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. రవి గుప్తా CGGకి, C.V. ఆనంద్ ను హోం శాఖకు బ‌దిలీ చేశారు. మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మార్చారు.

Sajjanar As a Hyderabad Commissioner

తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులలో భారీ పునర్వ్యవస్థీకరణ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా ఉన్న సీవీ ఆనంద్ కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌న‌కు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని అప్ప‌గించారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. ఈ పునర్విభజనలో రవి గుప్తాకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్ , డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. శిఖా గోయల్ కు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ . ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ గా నియ‌మించారు. స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్, చారు సిన్హా, అనిల్ కుమార్, విజయ్ కుమార్, వై. నాగి రెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, విక్రమ్ సింగ్ మాన్, ఎం. స్టీఫెన్ రవీంద్ర వంటి అనేక మంది సీనియర్ అధికారులకు 2012 నుండి 2018 బ్యాచ్‌ల అధికారులకు కొత్త పోస్టింగ్‌లు క‌ట్ట‌బెట్టారు.

Also Read : CM Revanth Reddy Important Meeting : ముంచెత్తిన వ‌ర్షాల‌పై సీఎం స‌మీక్ష

Exit mobile version