Sajjala Fired on CM Chandrababu : జేబులు నింపు కోవ‌డం కోసం బాబు అమ‌రావ‌తి జ‌పం

నిప్పులు చెరిగిన స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి కామెంట్స్

Hello Telugu - Sajjala Fired on CM Chandrababu

Hello Telugu - Sajjala Fired on CM Chandrababu

Sajjala : అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్ర‌తినిధి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి (Sajjala). అమరావతిలో ఉన్న భవనాలు చాలు అని, . కొత్తవి నిర్మించాల్సిన అవస‌రం లేద‌న్నారు. రూ. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని కోరారు. చంద్రబాబు జేబులు నింపుకోవడం కోసమే రాజధాని నిర్మాణం చేప‌డుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ రాచ‌రిక పాల‌న సాగిస్తున్నారంటూ ఆరోపించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Sajjala Ramakrishna Reddy Slams CM Chandrababu

సూప‌ర్ సిక్స్ సూప‌ర్ హిట్ అంటూ అనంత‌పురం వేదిక‌గా స‌భ నిర్వ‌హించ‌డం దారుణ‌మ‌న్నారు. ఏం సాధించార‌ని ఈ స‌భ‌ను నిర్వ‌హించారంటూ ప్ర‌శ్నించారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. ఇచ్చిన హామీల‌లో క‌నీసం ఒక్క‌టైనా వంద శాతం పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు. త‌మ వైసీపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల‌లో 10 కాలేజీల‌ను పీపీపీ మోడ‌ల్ లో ప్రైవేట్ ప‌రం చేస్తామ‌న‌డం సిగ్గు చేటు అన్నారు. తాము వీటిని అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఒక ర‌కంగా పేద‌ల‌కు వైద్యం దూరం చేయ‌డం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చిన స‌ర్కార్ వాటిని తీర్చ‌డంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందిందంటూ ఆరోపించారు వైసీపీ అధికార ప్ర‌తినిధి.

Also Read : Indian Govt Interesting Updates : మరో 2 ఏళ్లలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధ కేంద్రాలు

Exit mobile version