Saamana Fired on Amit Shah : అమిత్ షాపై ‘సామ్నా’ క‌న్నెర్ర

పీఎం, సీఎం తొల‌గింపు బిల్లుపై

Hello Telugu - Saamana Fired on Amit Shah

Hello Telugu - Saamana Fired on Amit Shah

Saamana : ముంబై – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డింది శివ‌సేన పార్టీ అధికార ప‌త్రిక సామ్నా (Saamana). ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తొలగింపు బిల్లుపై అమిత్ షాను సామ్నా విమర్శించింది . రాజకీయాలను శుభ్ర పరుస్తున్నట్లు నటిస్తూనే ఎన్డీఏ నాయకత్వం రాజకీయ అవినీతి దుర్మార్గపు బురదలో నిలబడి ఉందంటూ సంపాద‌కీయంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఈ సంద‌ర్బంగా ముందుగా ఈ బిల్లుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని రాజీనామా చేయాల‌ని కోరాల‌ని సూచించింది. ఆ ద‌మ్ము మీకు ఉందా అని ప్ర‌శ్నించింది. అటువంటి వ్యక్తులను మొదట ఉన్నత పదవులకు నియమించరాదని మండిప‌డింది. జైలు నుండి ఏ ప్రభుత్వాన్ని నడపలేమంటూ అమిత్ షా పేర్కొన‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. అయితే జైలులో ఉండటానికి అర్హులైన వ్యక్తులను నియమించడం కూడా పాలనను అన్యాయం చేస్తుందని పేర్కొంది.

Saamana Slams Amit Shah

లోక్‌సభలో షా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు – అరెస్టు చేసిన 30 రోజుల్లోపు ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించాలని ప్రతిపాదంచ‌డం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపింది. ప్రతిపక్షాలు దానిని చింపివేశాయని, ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేసింది సామ్నా సంపాద‌కీయం. సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 2010లో షా అరెస్టును గుర్తు చేసుకుంటూ, ఆయన రాజీనామా నైతిక విశ్వాసం వల్ల కాదు, గణనీయమైన సాక్ష్యాల కారణంగా జరిగిందని సంపాదకీయం పేర్కొంది. బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అమిత్ షా త‌న అధికారాన్ని ఉప‌యోగించి నిర్దోషిగా బ‌య‌ట ప‌డేలా చేసుకున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయాలు, ప్రభుత్వ భూమి, మైనింగ్ హక్కులను గౌతమ్ అదానీకి అప్పగించారని, ఇది జాతీయ నేరం కాదా అని నిల‌దీసింది. మోడీ నిజంగా నైతికతను కాపాడుకోవాలని అనుకుంటే షాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది, మోదీ హయాంలో అదానీ చేసిన దోపిడీ బ్రిటిష్ లేదా మొఘలుల కంటే గొప్పది అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో సహా రాష్ట్రాలలోని బిజెపి ప్రభుత్వాలు అదానీకి విస్తారమైన భూములను కేటాయించాయని ఆరోపించింది. విదేశాలలో అవినీతి కేసుల నుండి అదానీని రక్షించడానికి మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపారని పేర్కొంది.

Also Read : Telangana Dusshera Holidays Interesting : ద‌స‌రా పండుగ సెల‌వులు 13 రోజులు

Exit mobile version