S Jaishankar Fired on America : పాకిస్తాన్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది ఎవ‌రో తెలుసు

అమెరికాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన జై శంక‌ర్

Hello Telugu - S Jaishankar Fired on America

Hello Telugu - S Jaishankar Fired on America

S Jaishankar : ఢిల్లీ – కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే అమెరికాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర‌వాదుల‌కు, ఉగ్ర‌వాదానికి పాకిస్తాన్ కేరాఫ్ గా మారింద‌న్నారు. అమెరికాను ముప్పు తిప్ప‌లు పెట్టిన ఒసామా బిన్ లాడెన్ ను హ‌త్య చేసింది, ఆయ‌న దొరికింది ఎక్క‌డో కాదు దాయాది పాక్ లోనేన‌ని ఆ విష‌యం యావ‌త్ ప్ర‌పంచానికి తెలుస‌న్నారు. కానీ భార‌త దేశం అలా కాద‌ని, ఏ దేశంతోనూ తాము యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌న్నారు జై శంక‌ర్ (S Jaishankar). ఆదివారం జై శంక‌ర్ మీడియాతో మాట్లాడారు.

Foreign Minister S Jaishankar Slams America

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా, పాకిస్తాన్ ఒకదానికొకటి చరిత్రను కలిగి ఉన్నాయ‌ని ఆరోపంచారు. కానీ ఆ చరిత్రను విస్మరించిన చరిత్ర కూడా వారికి ఉందంటూ ఎద్దేవా చేశారు. 2011లో ఇస్లామాబాద్ సమీపంలో అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ హత్యను గుర్తు చేశారు మ‌రోసారి జైశంక‌ర్. ట్రంప్ పరిపాలనలో అమెరికా-పాకిస్తాన్ పునర్విభజన గురించి అడిగినప్పుడు పై విధంగా స్పందించారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఒక విధంగా దేశాలు సౌలభ్యం కోసం రాజకీయాలు చేయడంపై దృష్టి సారించినప్పుడు ఇలాంటివి కొన‌సాగుతూనే ఉంటాయ‌న్నారు. అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించే ముందు అమెరికా పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వ లేద‌న్నారు. అసిమ్ మునీర్ కు వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వ‌డం పై కూడా కామెంట్స చేశారు జై శంక‌ర్. దానిని తాము ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎవ‌రు ఏమిటో యావ‌త్ ప్ర‌పంచానికి తెలుస‌న్నారు.

Also Read : PM Modi – India Growth : మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్

Exit mobile version