RS Praveen Kumar : కరీంనగర్ జిల్లా – పాలన చేతకాని వాళ్లకు ప్రశ్నించే హక్కు లేదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar). కాంగ్రెస్ సర్కార్ ఎంతగా కుట్రలకు తెర తీసినా, అక్రమ కేసులు బనాయించినా గులాబీ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ లో పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి ప్రారంభించారు. దేశంలోనే ఎక్కడా ఏ పార్టీకి లేనంత క్యాడర్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆర్ఎస్పీ. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం తప్పితే సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
RS Praveen Kumar Shocking Comments
అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత సర్కార్ ఉందన్నారు. ప్రజలు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారని, ఆనాడు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఇంకెన్ని ఆచరణకు నోచుకోని హామీలు గుప్పించినా గుణపాఠం తప్పదన్నారు. అధికారం ఉంది కదా అని పోలీసు రాజ్యం నడిపిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అని వార్నింగ్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కావాలని కేసులు పెట్టినా, చంపుతామంటూ బెదిరించినా, సంక్షేమ పథకాలకు ఎంపిక చేయరని తెలిసినా, తమ భూములు అన్యాయంగా లాక్కుంటారని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదని అన్నారు. వీరి ధైర్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
గ్రామ గ్రామం నుండి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరవడం నిజంగా అద్భుతమని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీపై డా. సంజయ్ పై ప్రజల్లో ఉన్న అభిమానం చూస్తే, స్థానిక సంస్థల గులాబీ జెండా ఎగరడం పక్కా అని అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని మోసపు హామీలు ఇచ్చినా రేవంత్ సర్కార్ ను కాపాడడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు.
Also Read : HYDRA Commissioner Interesting Comments : తొలగిన అడ్డంకులు కలిసిన కాలనీలు
