HYDRA Commissioner Interesting Comments : తొల‌గిన అడ్డంకులు క‌లిసిన కాల‌నీలు

రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా క‌మిష‌న‌ర్

hellotelugu-hydraacommissioner

HYDRA : హైద‌రాబాద్ – హైడ్రా హైద‌రాబాద్ లో దూకుడు పెంచింది. రెండు కాల‌నీల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించింది. అడ్డు గోడ‌ల‌ను తొల‌గించి అనుసంధానం ఏర్పాటు చేసింది. హ‌బ్సీగూడ‌లో స్ట్రీట్ నంబ‌రు 6 లోఉన్న అడ్డుగోడ తొల‌గ‌డంతో నంద‌న‌వ‌నం, జ‌యాన‌గ‌ర్ కాల‌నీల మ‌ధ్య దూరం త‌గ్గింది. ఇప్పుడు నంద‌న‌వ‌నంలోని స్ట్రీట్ నంబ‌రు 4 నుంచి నేరుగా 6లోకి వ‌చ్చి హ‌బ్సీగూడ ప్ర‌ధాన ర‌హ‌దారికి చేరుకుంటున్నారు. కాల‌నీల‌కు అడ్డ‌గా ఉన్న గోడ‌ల‌ను తొల‌గించ‌డంతో కాల‌నీవాసులు హైడ్రా (HYDRA) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నారు.

HYDRA Commissioner Interesting Comments

ఈ అడ్డుగోడ తొల‌గ‌డంతో కేవ‌లం 300 మీటర్లు ప్ర‌యాణించి ఎన్‌జీఆర్ ఐ మెట్రో స్టేష‌న్‌కు చేరుకుంటున్నామ‌ని నంద‌న‌వ‌నం కాల‌నీ వాసులు సంతోషం వ్య‌క్తం చేశారు. లేదంటే ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి నానా అవ‌స్థ‌లు ప‌డేవాళ్ల‌మ‌ని ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పోయింద‌న్నారు. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా అవ‌స్థ‌లు ప‌డ్డామ‌ని, ఎన్నిసార్లు అధికారుల‌కు, పాల‌కుల‌కు తెలిపినా ప‌ట్టించు కోలేద‌ని వాపోయారు. క‌మిష‌న‌ర్ చ‌ర్య‌ల కార‌ణంగా ఆ ఇక్క‌ట్లు త‌ప్పాయ‌న్నారు.

ఎన్నో సార్లు మున్సిప‌ల్ అధికారుల‌ను క‌లిసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్నారు. ఆఖ‌ర‌కు జ‌యాన‌గ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడినా జ‌గ‌డ‌మే కాని.. స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌న్నారు. ఇదే విష‌య‌మై హైడ్రాకు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే ప‌రిష్కారం దొరికింద‌ని తెలిపారు.

అంత‌కు ముందు మాసంచెరువు – దిలావర్ఖాన్ – పెద్ద అంబ‌ర్ పేట‌ చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ నాలా పొడుగున చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని అన్నారు.

Also Read : Popular Actor Kangana Ranaut : పార్టీలు వేరైనా లీడ‌ర్లంతా ఒక్క‌టే – కంగ‌నా ర‌నౌత్

Exit mobile version