Roshni Nadar Growth in Top 3 : దేశంలో అత్యంత ధ‌న‌వంతురాలిగా రోష్నీ నాడ‌ర్

ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్టులో టాప్ 3లోకి

Hello Telugu - Roshni Nadar Growth in Top 3

Hello Telugu - Roshni Nadar Growth in Top 3

Roshni Nadar : చెన్నై : ప్ర‌ముఖ ఐటీ టెక్నాల‌జీ సంస్థ చెన్నైకి చెందిన శివ నాడ‌ర్ స్థాపించిన హెచ్ సీ ఎల్ సంంచ‌ల‌నం సృష్టించింది. త‌న కూతురు రోష్నీ నాడ‌ర్ (Roshni Nadar) ప్ర‌స్తుతం ఈ ఐటీ సేవ‌ల సంస్థ‌కు చైర్ ప‌ర్స‌న్ గా ఉన్నారు. ఇవాళ భార‌త దేశంలోనే అత్యంత ధ‌న‌వంతురాలైన మ‌హిళ‌గా నిలిచారు. చ‌రిత్ర సృష్టించారు. ఆమె ఆస్తులు ప్ర‌తి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. సీఎస్ఆర్ కింద అనేక సామాజిక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది ఈ కంపెనీ. ప్ర‌త్యేకంగా ఐటీపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఏకంగా రోష్నీ నాడ‌ర్ నిక‌ర ఆస్తుల మొత్తం విలువ ఇప్ప‌టి మార్కెట్ ఆధారంగా చూస్తే అక్ష‌రాల రూ. 2.84 ల‌క్ష‌ల కోట్లు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌ముఖ హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో క‌లిసి ఎం3ఎం ఇండియా విడుద‌ల చేసింది.

Roshni Nadar Growth

ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్‌లో ఇది వెల్లడైంది. విచిత్రం ఏమిటంటే ఈ జాబితాలో ఒక మహిళ టాప్ 3లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇక ముఖేష్ అంబానీ, కుటుంబం భారతదేశంలో అత్యంత ధనవంతులుగా తిరిగి అగ్రస్థానాన్ని పొందారు, రూ. 9.55 లక్షల కోట్ల సంపదతో టాప్ లోకి వ‌చ్చారు. గౌతమ్ అదానీ కుటుంబం రూ. 8.15 లక్షల కోట్ల ఆస్తులతో వెనుకబడి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన జాబితాలో ఇండియాలో 350 మందికి పైగా బిలియనీర్లు ఉన్నారు. 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి ఆరు రెట్లు ఎక్కువ. వీరంద‌రి నికర విలువ రూ. 167 లక్షల కోట్లు అంటే భారతదేశ జీడీపీలో దాదాపు స‌గం కావ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : Kondareddypally Interesting Update : వంద శాతం సౌర‌శ‌క్తి గ్రామంగా కొండారెడ్డిప‌ల్లి

Exit mobile version