తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

hellotelugu-BhattiVikramarka

హైద‌రాబాద్ : విద్యుత్ ఉత్పత్తి వనరులను మార్చడం మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థనే పునర్నిర్మించే ఒక పరివర్తనాత్మక ప్రక్రియే ‘ఇంధన పరివర్తన’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామం తెలంగాణ అని, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఇంధన కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవోటెల్ వేదికగా జరిగిన రెండు రోజుల ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్‌పో 2026’ను ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు , సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. పెట్టుబ‌డిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రకాల పెట్టుబడులను ప్రోత్సహించే రాష్ట్రంగా ఉంద‌న్నారు.

సంపదను పంచుకోవడానికి, అలాగే మాతో కలిసి ఎదగడానికి మిమ్మల్ని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామని అని భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన పరివర్తన అనేది కేవలం విద్యుత్ ఉత్పత్తి వనరులను మార్చడం మాత్రమే కాదని, అది మొత్తం ఆర్థిక వ్యవస్థనే పునర్నిర్మించే ఒక పరివర్తనాత్మక ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను కేవలం స్వచ్ఛ ఇంధన వినియోగదారుగా మాత్రమే కాకుండా, స్వచ్ఛ ఇంధన సాంకేతికతల తయారీలో ఒక ప్రధాన ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే తన దార్శనికతను ఆయన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి రాష్ట్రం ప్రణాళికలు రూపొందించిందని భట్టి విక్రమార్క వివరించారు. దీనిలో భాగంగా 2030 నాటికి సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు, 2035 నాటికి 26,000 మెగావాట్లకు పైగా పెంచాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Exit mobile version