Rohit Sharma Growth : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శ‌ర్మ టాప్

ప్ర‌క‌టించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్

Hello Telugu - Rohit Sharma Growth

Hello Telugu - Rohit Sharma Growth

Rohit Sharma : దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వర‌ల్డ్ వైడ్ గా వ‌న్డే ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) టాప్ లో నిలిచాడు. సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ‌, చివరి వన్డేలో తన అద్భుతంగా ఆడాడు. అజేయ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ఇండియా జ‌ట్టు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ లో ఆతిథ్య జ‌ట్టు సీరీస్ కైవ‌సం చేసుకుంది. మూడు మ్యాచ్ ల‌లో తొలి, రెండో వ‌న్డేల‌లో ఆసిస్ టీమ్ ఇండియాను ఓడించింది. తాజాగా ప్ర‌క‌టించిన పురుష బ్యాట‌ర్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు. చ‌రిత్ర సృష్టించాడు. ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొంద‌డంలో హిట్ మ్యాన్ కీల‌క పాత్ర పోషించాడు. దీంతో రెండు స్థానాలు ఎగ‌బాకి టాప్ లోకి చేరుకున్నాడు.

Rohit Sharma Growth

రోహిత్ అజేయ సెంచ‌రీలో 13 ఫోర్లు , 3 సిక్స‌ర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీతో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కోహ్లీ 74 ర‌న్స్ చేశాడు. 38 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన రోహిత్ గ‌త కొంత కాలంగా 10 స్థానాల‌లో నిలిచాడు. ఇక ఐసీసీ ప్ర‌క‌టించిన బౌల‌ర్ల ర్యాంకింగ్స్ లో ఆరు స్థానాలు ఎగ‌బాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలర్ల టాప్ 10లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 4వ స్థానానికి, ఆసిస్ సీమ‌ర్ జోష్ హాజిల్ వుడ్ 8వ ప్లేస్ లోకి చేరాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ హ్యారీ బ్రూక్ 25వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు బౌల‌ర్ల జాబితాలో ఇయాన్ బిష‌ప్ 13వ ప్లేస్ కు చేరుకున్నాడు. ఐడెన్ మార్క‌రామ్ 15వ స్థానంలోకి చేరాడు.

Also Read : PM Modi Interesting Comments on Bihar : బీహార్ లో ఎన్డీయేదే విజ‌యం : మోదీ

Exit mobile version