PM Modi : బీహార్ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి ఉంది. మరోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కానున్నారని, ఎన్డీయే కూటమి జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. బీహార్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ (PM Modi ). విజయ శంఖం పూరించడం పక్కా అని పేర్కొన్నారు. బెగుసరాయ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పీఎం పాల్గొన్నారు . ముజఫర్‌పూర్, ఛప్రాలో ర్యాలీలు చేపట్టారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. బీహార్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వారంతా మూకుమ్మడిగా డబుల్ ఇంజిన్ సర్కార్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగందన్నారు నరేంద్ర మోదీ.
PM Modi Key Comments on Bihar Electtions
ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను లక్ష్యంగా చేసుకున్నారు. ఇండియా కూటమికి చెందిన పార్టీలను, నేతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. వారి మధ్యనే ఐక్యత లేదని, ఇక రాష్ట్రాన్ని , ప్రజలను ఎలా నమ్మించ గలుగుతారని ప్రశ్నించారు నరేంద్ర మోదీ. సమర్థవంతమైన నాయకత్వంతో బీహార్ అన్ని రంగాలలో ముందుకు వెళుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రం పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. అక్రమ పద్దతుల్లో ఓట్ల ద్వారా గెలిచేందుకు ఎన్డీయే సర్కార్ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. కాగా ఆయన చేసిన కామెంట్స్ ను ఖండించారు ప్రధాని.
Also Read : YS Jagan Interesting Comments : తుపాను బాధితులకు అండగా నిలవాలి : జగన్ రెడ్డి
