Reliance Growth : కెల్వినేట‌ర్ ను స్వంతం చేసుకున్న రిల‌య‌న్స్

రిటైల్ సంస్థ‌లో విలీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

hellotelugu-relianceretail

Reliance : ముంబై – భార‌తీయ వ్యాపార రంగంలో టాప్ లో కొన‌సాగుతున్న అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే మార్కెట్ లో ఉన్న ప్ర‌ముఖ సంస్థ కెల్వినేట‌ర్ ను స్వంతం చేసుకున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా విలీనం చేసుకునేందుకు ఒప్పందం కూడా ఖ‌రారైంద‌ని స్ప‌ష్టం చేసింది. భారతదేశ వినియోగదారుల మన్నికైన వస్తువుల మార్కెట్‌ను పునర్నిర్మించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భాగంగా రిల‌య‌న్స్ (Reliance) ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Reliance New Industy

రిలయన్స్ రిటైల్ ఒక శతాబ్దానికి పైగా గృహ శీతలీకరణ, ఆవిష్కరణలకు పర్యాయపదంగా ఉన్న లెగసీ బ్రాండ్ కెల్వినేటర్‌ను కొనుగోలు చేసింది. ప్రీమియం గృహోపకరణాల విభాగంలో తన స్థానాన్ని విస్తరించడమే కాకుండా, స్కేల్, టెక్నాలజీ, యాక్సెసిబిలిటీ ద్వారా వినియోగదారుల వ‌ద్ద‌కు చేరుకునే దిశ‌గా అడుగులు వేసింది రిల‌య‌న్స్.

ఇక సంస్థ అధికారిక లావాదేవీ విలువను వెల్లడించనప్పటికీ, కంపెనీ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కెల్వినేటర్ విలువ రూ1,200 నుంచి రూ. 1,500 కోట్ల పరిధిలో ఉంటుందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 3,30,870 కోట్ల ఏకీకృత టర్నోవర్ , రూ. 25,053 కోట్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఆసియా ఖండంలోనే అత్యంత విలువైన రిటైల్ సంస్థ‌లో ఒక‌టిగా నిలిచింది.

Also Read : Petrol and Diesel Prices Sensational : పెట్రోల్, డీజిల్ ధరలపై వస్తున్న అఫాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

Exit mobile version